వైట్ డిశ్చార్జ్ అవుతుందా? ఈ ఆకులతో సులభంగా చెక్ పెట్టొచ్చు..

by Dishafeatures3 |
వైట్ డిశ్చార్జ్ అవుతుందా? ఈ ఆకులతో సులభంగా చెక్ పెట్టొచ్చు..
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది మహిళలు వైట్ డిశ్చార్జ్ కారణంగా బాధపడుతుంటారు. అలసట, ఒత్తిడి, ప్రైవేట్ పార్ట్ ప్రాంతంలో సరిగ్గా క్లీన్ చేయకపోవడం ఇందుకు కారణం. కాగా దీనివల్ల దురద, మదబద్ధకం, దుర్వాసన వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పది మందిలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు ఉంటుంది. అందుకే తెల్లబట్ట నుంచి బయటపడేందుకు కొన్ని టిప్స్ అందిస్తున్నారు నిపుణులు.

తులసి ఆకులు

కొన్ని తులసి ఆకులను పేస్ట్ చేసి వాటిని తేనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని వేడి నీళ్లు లేదా పాలలో కలిపి వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జామ ఆకులు

జామ ఆకులు తెల్లబట్ట నివారణలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసి సమస్యకు పరిష్కారం ఇవ్వగలవు. అందుకే గుప్పెడు జామ ఆకులను తీసుకుని నీళ్లలో మరిగించి రోజూ హెర్బల్ టీ మాదిరిగా తీసుకోవాలి.

ఉసిరి

టేబుల్ స్పూన్ ఉసిరి పొడి తీసుకుని అందులో తేనెను కలిపి రోజూ తీసుకుంటే.. నెలలోపు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

ధనియాలు +మెంతులు

ధనియాలు రెండు స్పూన్లు, మెంతులు రెండు స్పూన్లు తీసుకుని రెండు గ్లాసుల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండు గ్లాసుల నీరు కలిపి ఒక్క గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. కాస్త చల్లబడ్డాక ఈ గ్లాసు నీటిని తాగాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లో వైట్ డిశ్చార్జ్ తగ్గిపోతుంది.


(ఈ సమాచారం ఆయుర్వేదం ప్రకారం చెప్పబడింది)

Next Story

Most Viewed