పగడాలు అంటే సముద్ర జీవా..?

by S Gopi |
పగడాలు అంటే సముద్ర జీవా..?
X

దిశ, వెబ్ డెస్క్: పగడాలు అంటే సముద్ర జీవి అనగానే మీరు ఆశ్చర్యపోయి ఉంటారు. అయితే, పగడం అంటే అందరూ అనుకునేట్లుగా రాయి కాదు. అలా కనిపించే చిన్న సముద్ర జీవి. పగడం బయట వైపు అస్థిపంజరం ఉండి లోపల జీవి నివసిస్తుంది. ఇది చాలా సున్నితమైన జీవి. పగడం చనిపోయినా అస్థిపంజరం చెక్కు చెదరకుండా ఉంటుంది. అవి గుంపులు గుంపులుగా లక్షల సంఖ్యలో నివాసం ఏర్పరచుకుంటుంటాయి. పగడపు దీవులు పూలు, ఫ్యాన్, వేళ్లు లేదా భారీ మెదడు ఆకారాల్లో ఉంటాయి. ఈ దీవులు తీర ప్రాంతానికి దగ్గరలోనే ఉంటాయి. అయితే, నవరత్నాలలో పగడం కూడా ఒకటి. స్త్రీలు పగడాలతో హారం తయారు చేయించుకుంటుంటారు.



Advertisement

Next Story

Most Viewed