చిన్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయులు వేసిన శిక్షలు - వాటికి అర్థాలు

by S Gopi |
చిన్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయులు వేసిన శిక్షలు - వాటికి అర్థాలు
X

దిశ, వెబ్ డెస్క్: పెద్దలు ఏది చేసినా అందులో పరమార్థం దాగి ఉంటుందని అంటుంటారు. ఇప్పుడా మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే.. అప్పుడప్పుడు మనకు చిన్ననాటి రోజులు గుర్తొస్తే ఆశ్చర్యమేస్తుంటది. అంతేకాదు.. అందులో ముఖ్యంగా స్కూల్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే వెంటనే ఉపాధ్యాయులు దండించడమో, ఖండించడమో ఉండేది. ఆ తప్పుకు తగ్గ శిక్షలు వేసేవారు. ఆ శిక్షలు ఇప్పుడు గుర్తుచేసుకుంటే నవ్వొస్తుంటది.. కానీ, అప్పుడు ఉపాధ్యాయులు వేసిన ఆ చిన్న చిన్న శిక్షల వెనుక మనకు మేలు చేసే ఎంతో అర్థముందంటా.

ప్రముఖులు చెప్పిన ప్రకారం అవేమంటే...

1. మోకాళ్ల మీద కూర్చోబెడితే - వినయంగా ఉండాలని

2. చెవులు పట్టుకోమంటే - శ్రద్ధగా వినమని

3. నోటి మీద వేలు వేసుకోమంటే - నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవొద్దని

4. గోడవైపు చూస్తూ నిలబడమంటే - ఆత్మ పరిశీలన చేసుకోమని

5. చేతులెత్తి నిలబడమంటే - నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని

6. బెంచి ఎక్కి నిలబడమంటే - నీవు చదువులో అందరి కంటే పైన ఉండాలని

7. ఏదైనా విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే - గెలిచే వరకు పోరాడమని

8. బ్లాక్ బోర్డు తుడవమంటే - తప్పులు సరిచేసుకోమని

9. తరగతి గది బయట నిలబెడితే - పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని అర్థముందంటా.

Advertisement

Next Story

Most Viewed