దారితప్పుతున్న రొమాన్స్.. స్పానిష్ పీపుల్ ఆలోచనే వేరట !

by Prasanna |
దారితప్పుతున్న రొమాన్స్.. స్పానిష్ పీపుల్ ఆలోచనే వేరట !
X

దిశ, ఫీచర్స్ : ఇండియాతోపాటు అనేక దేశాల్లో ఒకరికంటే ఎక్కువమంది సెక్సువల్ పార్టనర్స్‌ను కలిగి ఉండటాన్ని అనైతిక చర్యగా భావిస్తారు. కానీ స్పెయిన్‌ దేశంలో మాత్రం ఇదొక సాధారణ ప్రక్రియగా మారిపోయింది. ఇక్కడ 47 శాతం మంది ప్రజలు స్త్రీ, పురుషుడు ఎవరైనా సరే తమ పార్టనర్‌తోపాటు ఇంకా ఒకరికంటే ఎక్కువమంది ఇతరులతో కూడా ఎఫైర్స్ కలిగి ఉంటారని సెంట్రో డి ఇన్వెస్టిగేషన్ సోషియోలాజికస్(CIS) పేర్కొన్నది. 2021తో పోల్చితే 2023లో ఈ విధంగా మల్టిపుల్ సెక్సువల్ పార్టనర్స్‌ను కలిగి ఉంటున్నవారి సంఖ్య 12 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.

స్పెయిన్‌లో ఒకరికంటే ఎక్కువమందితో లైంగిక సంబంధాలను కలిగి ఉండటంపట్ల పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ, ఆ పరిస్థితి మరింత పెరుగుతుండటంపట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విచ్ఛలవిడి మానవ సంబంధాలకు అడ్డుకట్ట వేయాలనే విజ్ఞప్తులు కూడా వస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఆలోచనలో పడిందట. అయితే మెజార్టీ ప్రజల్లో మాత్రం ఈ విషయంపై పెద్దగా పట్టింపు లేనట్లు కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి రొమాంటిక్ ధోరణి ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవడానికి సీఐఎస్ సంస్థకు చెందిన నిపుణులు సర్వేలో భాగంగా పలువురిని ప్రశ్నించారు. ఆశ్చర్యం ఏంటంటే అత్యధికమంది తమకు లైఫ్ పార్టనర్ ఉన్నప్పటికీ, బయట ఇతర వ్యక్తులతో సెక్సువల్ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తున్నట్లు వెల్లడించారు. మరో విషయం ఏంటంటే తమ పార్టనర్ ఇతరులతో సెక్సువల్ రిలేషన్ కలిగి ఉండటాన్ని కూడా ఇక్కడ చాలామంది పట్టించుకోవడంగానీ, తప్పు బట్టడం గానీ చేయట్లేదు. పైగా 70 శాతం మంది మల్టిపుల్ సెక్సువల్ రిలేషన్‌షిప్స్ కొనసాగిస్తూనే, తమ లైఫ్ లాంగ్ పార్టనర్‌తో కూడా ప్రేమగా, నమ్మకంగా ఉంటున్నట్లు సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story