- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్టిపుల్ సెక్స్ పార్టనర్స్‌ను కలిగి ఉంటున్న స్పానిష్ పీపుల్.. CIS సర్వేలో వెల్లడి
దిశ, ఫీచర్స్ : స్పెయిన్‌లో 47 శాతం మంది ప్రజలు ఒకరికంటే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటున్నారని ఆ దేశానికి చెందిన సెంట్రో డి ఇన్వెస్టిగేసియన్స్ సోషియోలాజికాస్ (CIS) సర్వే పేర్కొన్నది. అయితే 2021 అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేతో పోల్చితే ప్రస్తుతం అలాంటివారి సంఖ్య 10 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. మానవ సంబంధాల్లో మారుతున్న ధోరణిని తెలుసుకునే ఉద్దేశంతో సర్వేలో పాల్గొన్న నిపుణులు పలువురిని ప్రశ్నించినప్పుడు అత్యధికమంది తాము జీవిత భాగస్వామితోపాటు బయట ఇతర వ్యక్తులతో సెక్సువల్ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తున్నామని అంగీకరించారు. అంతేకాకుండా అలా ఉండటంలో తప్పేం లేదని అభిప్రాయపడ్డారు. స్పానిష్ ప్రజల్లో ఈ ధోరణి పెరుగుతున్నప్పటికీ పవర్ ఆఫ్ లవ్ మీద బలమైన నమ్మకాన్ని కూడా కలిగి ఉంటున్నారని, 70% మంది ‘నిజమైన ప్రేమ అందరినీ జయించగలదు’ అని అంగీకరిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. ఇక సామాజిక సంబంధాలు, కుటుంబ జీవితం, శృంగార వ్యవహారాల్లో సంతృప్తి విషయంలో ప్రశ్నించినప్పుడు 41 శాతం మంది లైఫ్ పార్టనర్‌తోపాటు ఇతరులతో కూడా రొమాంటిక్ రిలేషన్‌షిప్ వల్ల సంతృప్తి పొందుతున్నట్లు వెల్లడించగా, 31 శాతం మంది తమ ఫ్రెండ్స్‌వల్ల, 37 శాతం మంది తమ లైఫ్ పార్టనర్ వల్ల సంతృప్తి చెందుతున్నట్లు వెల్లడించారు. అయితే స్పానిష్‌లో ఎక్కువమందితో లైంగిక సంబంధాలు కలిగి ఉండటాన్ని మెజార్టీ ప్రజలు తప్పుబట్టడం లేదు. పైగా అలా ఉండటంతో ఎటువంటి సమస్యలేదని స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :: ఆషాడమాసంలో అత్త ముఖం కోడలు ఎందుకు చూడకూడదో తెలుసా?