ఆకాశంలో అమ్మ పుట్టినరోజు చేసిన బుడ్డోడు.. నెట్టింట చూసిన బెస్ట్ వీడియో ఇదే..

by Dishafeatures3 |
ఆకాశంలో అమ్మ పుట్టినరోజు చేసిన బుడ్డోడు.. నెట్టింట చూసిన బెస్ట్ వీడియో ఇదే..
X

దిశ, ఫీచర్స్: తనను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తల్లికి అంతకంటే ఆప్యాయంగా చూసుకునే కొడుకు పుట్టడం అదృష్టమే. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే అంత లక్ కలిసి వస్తుంది. ఈ అమ్మ నిజంగానే అంత పుణ్యం చేసుకుని ఉంది అనుకుంటా అందుకే ఇంత గొప్ప కొడుకును కన్నది. ప్రపంచమే ఫిదా అయిపోయి.. ఆయన ప్రేమకు పడిపోయే బిడ్డకు జన్మనిచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ పదేళ్లున్న చిన్నోడు తల్లితో కలిసి విమానంలో జర్నీ చేస్తున్నాడు. అయితే అదే రోజు తన తల్లి పుట్టినరోజు కావడంతో ఎలాగైనా స్పెషల్ డేగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే పైలట్ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. విమానంలోని ఎంప్లాయిస్ తో పాటు ప్రయాణికులు అందరూ కలిసి తన తల్లికి విష్ చేయాలని, దానికి ముందు ఆమె బర్త్ డేను అనౌన్స్ చేయాలని కోరాడు. విషయాన్ని అర్థం చేసుకున్న పైలట్ పూర్తిగా ఎమోషనల్ అయిపోయి ఆ బుడ్డోడు చెప్పినట్లే ఫాలో అయ్యాడు. ఆ తల్లికి ఎప్పటికీ గుర్తుండిపోయే పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా .. అమ్మపై కొడుకు ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.




Next Story

Most Viewed