సిగ్గాకు మొక్కను, ఆకుల్ని చూశారా ?.. తింటే ఆ కోరికలు ఆపుకోలేరట !

by Sumithra |
సిగ్గాకు మొక్కను, ఆకుల్ని చూశారా ?.. తింటే ఆ కోరికలు ఆపుకోలేరట !
X

దిశ, ఫీచర్స్ : టచ్ చేస్తే ముడుచుకుపోయే ఆకులు గల మొక్క గురించి మీరెప్పుడైనా విన్నారా? అటవీ ప్రాంతాల్లో, గ్రామాల్లో చాలానే కనిపిస్తాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తుంటారు. సిటీల్లో ఉండేవారికి ఎక్కువగా తెలియకపోవచ్చు కానీ రూరల్ ఏరియాల్లో చాలామందికి సుపరిచితమే. పిల్లలు కూడా దీనితో ఆడుకుంటూ ఉంటారు. అత్తి పత్తి మొక్క ఆకు, సిగ్గాకు అనే పేర్లతో కూడా పిలుస్తారు. కొంచెం గాలి వీచినా, మనుషులు దానిని ముట్టుకున్నా ఈ మొక్క ఆకులు వెంటనే ముడచుకుంటాయి. అయితే ఈ మొక్కతో, ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

అలసటను దూరం చేస్తాయి

అత్తిపత్తి మొక్క ఆకులు ఆయుర్వేదిక్ మెడిసన్ తయారీకి ఉపయోగిస్తారట. ఈ మొక్కను ఇంటి పరిసరాల్లో పెంచుకుంటే నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుందని, దాని గాలి తగిలితే మానసిక వికాసం కలుగుతుందని నమ్ముతుంటారు. పురాతన కాలంలో రుషులు దీనిని ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగించారని చెబుతారు. శారీరక నొప్పులు, అలసటను దూరం చేయడంలో ఈ సిగ్గాకు మొక్క ఆకులు అద్భుతంగా పనిచేస్తాయట. వాటి వేర్లను లేదా ఆకులను మెత్తగా నూరి పెరుగుతో కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తినడంవల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఇక రాత్రిపూట పాలలో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుందని, నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయని చెప్తారు. అత్తిపత్తి మొక్క వేర్లను నీటిలో ఉడకబెట్టిన తర్వాత ఆ నాటిని తాగితే మూత్ర పిండాలు శుభ్రం అవుతాయని, కిడ్నీ సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేదిక్ నిపుణులు అంటుంటారు.

లైంగిక సామర్థ్యం పెరుగుతుంది !

సిగ్గాకు లేదా అత్తిపత్తి ఆకులను, వేర్లను ఎండలో ఆరబెట్టి, పొడిగా చేసి ఆ తర్వాత ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఈ పొడిని రోజూ రెంటు పూటల చిటికెడు తింటే రక్తంలో చక్కెరస్థాయిలు తగ్గుతాయి. శరీరంలో వాపులు, హానికర గడ్డలు, మొటిమలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. గాయాలు, పుండ్లు అయినప్పుడు సిగ్గాకు మెుక్క రసాన్ని పూయడంవల్ల మానిపోతాయి. ఇక సిగ్గాకు మొక్క వేర్లు, ఆకులు స్త్రీ, పురుషుల్లో అనేక శారీరక, మానసి రుగ్మతలను తగ్గించి, మానసిక వికాసానికి దోహద పడతాయని, ముఖ్యంగా లైంగిక పరమైన కోరికలను ప్రేరేపిస్తాయని చెప్తారు. కొన్ని గిరిజన గూడేల్లో కొత్తగా పెళ్లయిన జంటకు సిగ్గాకు మొక్కల ఆకులను తినిపించడం చేస్తుంటారు. దీంతో వారిలో లైంగిక సామర్థ్యం, కోరికలు పెరిగి త్వరగా సంతానం కలుగుతుందని నమ్ముతారు. అయితే ఈ మొక్క ఆకులు, వేర్లవల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేదిక్ నిపుణులు, పెద్దలు మాత్రమే చెప్తుంటారు. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేవు. ఎటువంటి పరిశోధనలు కూడా జరగలేదు. కాబట్టి వినియోగించే ముందు నిపుణులను సంప్రదించడం బెటర్.

Advertisement

Next Story

Most Viewed