- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో బాధపడుతున్నారా? ఈ సింపుల్ ఫుడ్‌తో సమస్యకు చెక్
దిశ, ఫీచర్స్ : ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కామన్ అయిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం మంది స్త్రీలు క్రమరహిత రుతుక్రమాన్ని ఎదుర్కొంటున్నారు. అంటే 26-35 రోజుల్లో నెక్ట్స్ పీరియడ్ రాకుండా ఉంటుంది. దీనివల్ల సంతానోత్పత్తిపై ప్రభావంతోపాటు అనేక అనారోగ్య సమస్యలు ఎటాక్ అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కొన్ని ఫుడ్స్ డెయిలీ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్న నిపుణులు.. వీటివల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.
అల్లం
జలుబుకు ఉపశమనం పొందడం నుంచి జీర్ణక్రియను మెరుగుపరిచే వరకు.. అల్లం బెస్ట్ రెమిడీగా వర్క్ చేస్తుంది. అయితే ఈ విటమిన్ సి, మెగ్నీషియం-రిచ్ మసాలా క్రమరహిత పీరియడ్స్‌ను అనుభవించినప్పుడు కూడా రక్షణను అందిస్తుందని చెప్తున్నారు నిపుణులు. అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. ప్రధానంగా మీ పీరియడ్స్ ప్రవాహాన్ని ప్రారంభించే గర్భాశయాన్ని సంకోచించడంలో సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల ద్వారా పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు 2014 క్లినికల్ అధ్యయనం ప్రకారం రుతుస్రావం సమయంలో అధిక బ్లీడింగ్ తగ్గించడంలోనూ ఇది హెల్ప్ చేస్తుంది. మానసిక కల్లోలం, ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ (PMS) లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బొప్పాయి
బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గర్భాశయ కండరాలు సంకోచించడంలో సహాయపడుతుంది. శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడమే కాకుండా. ఇందులో ఉండే కెరోటీన్ శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలను నియంత్రిస్తుంది. తరచుగా పీరియడ్స్ వచ్చేలా సాయపడుతుంది. ఈ కారణంగానే గర్భధారణ సమయంలో ఈ పండును దూరం పెట్టమపి చెప్తుంటారు నిపుణులు. బొప్పాయిలో ఉండే అధిక నీటి కంటెంట్ హైడ్రేషన్‌ను అందిస్తుంది. పీరియడ్స్ సమయంలో ఉబ్బరం సమస్యలను కూడా అరికడుతుంది.
పైనాపిల్
ఋతు రక్తము ప్రధానంగా ఫలదీకరణం చెందని అండాలను బయటకు పంపుతుంది. గర్భాశయం గోడను తొలగిస్తుంది. అందుకే గర్భాశయంలోని పొరను తొలగించడానికి లేదా మృదువుగా చేయడానికి సహాయపడే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉండగా.. బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ప్రకారం, బ్రోమెలైన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నొప్పి-ఉపశమనకారిగా పనిచేస్తుంది. దానితో పాటు ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మెరుగైన రక్త ప్రసరణకు హామీ ఇస్తుంది.
చెరకు రసం
తాజా చెరకు రసం హార్మోన్లను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది హార్మోన్ల సామరస్యానికి దోహదపడే సమ్మేళనాల స్టోర్‌హౌస్. కాగా సమతుల్య, ఆరోగ్యకరమైన ఎండోక్రైన్ వ్యవస్థను అందించడంలో శరీరానికి సహాయపడుతుంది.షుగర్ కేన్ జ్యూస్ ఉత్తమ ఎలక్ట్రోలైట్‌గా కూడా పనిచేస్తుంది. ఐరన్ స్థాయిలను రీస్టోర్ చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరచడంతోపాటు ఉబ్బరం నుంచి ఉపశమనం అందిస్తుంది.శరీరాన్ని హైడ్రేట్‌గానూ ఉంచుతుంది.
దాల్చిన చెక్క
రుతుక్రమ సమస్యలతో బాధపడే స్త్రీలకు దాల్చిన చెక్క ప్రయోజనం చేకూరుస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజీలో ప్రచురించబడిన 2014 పరిశోధన ప్రకారం.. దాల్చినచెక్క పీరియడ్ సైకిల్ నియంత్రించడంలో సహాయపడుతుంది. పిసిఒఎస్ ఉన్న మహిళలకు సమర్థవంతమైన నివారణగా ఉంటుంది. పీరియడ్ పెయిన్, రక్తస్రావం, వికారం, వాంతులు వంటి లక్షణాలను కూడా అరికడుతుంది.
ఫెన్నెల్
సోంపు గురించి అంతగా తెలియని సామర్థ్యాలలో ఒకటి.. పీరియడ్స్ నియంత్రించడంలో సహాయపడటం. ఫెన్నెల్ సీడ్స్ శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో రుతుక్రమ సమస్యలకు నివారణగా ఉపయోగించబడుతున్నాయి. ఈ సుగంధ మూలికలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉండే అనెథోల్,ఫెన్‌చోన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలను శాంతపరచడానికి, విశ్రాంతి తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఋతుస్రావం సమయంలో నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. వీటిని తరుచుగా సూప్స్, టీలో చేర్చడం ద్వారా మీ రుతుక్రమం సాఫీగా సాగిపోతుంది.