ప్రకృతిపై సూర్య గ్రహణం ఎఫెక్ట్..ఆ రోజు పక్షులు, జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-03-30 10:20:46.0  )
ప్రకృతిపై సూర్య గ్రహణం ఎఫెక్ట్..ఆ రోజు పక్షులు, జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇక గ్రహణం ఏర్పడే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు పండితులు. దీని ప్రభావం రాశుల మీద పడుతుంది. దీంతో ఇది కొందరికి మంచి ఫలితాలను ఇస్తే మరికొందరికి అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే గ్రహణ ప్రభావం మానవుల మీదనే కాకుండా జంతువులు, పక్షులు, కీటకాల మీద కూడా చూపిస్తుదంట.

సూర్యగ్రహణం కారణంగా పక్షులు,కీటకాలు చాలా వింతగా ప్రవర్తించడాన్ని పరిశోధకులు గమనించారంట. గ్రహణం సమయంలో పక్షులు వలస వెళ్లేవి దారి తప్పినట్లుగా, కాస్త గందరగోళానికి గురి అయ్యాయంట. అలాగే జూ పార్కులలో ఉండే గాలాపాగోస్, తాబేళ్లు గ్రహణ సమయంలో సంతానోత్పత్తి ప్రారంభిచడం అలాగే సియామాంగ్స్, గిబ్బన్ల జంట విచిత్రమైన రాగాలు పాడటం, మగ జిరాఫీలు ఆందోళనగా పరుగులు పెట్టడం, ఫ్లెమింగోలు పిల్లల చుట్టు గుమిగూడటం లాంటివి చేశాయంట. అంతే కాకుండా తేనటీగలు గ్రహణం సమయంలో నిశ్శబ్దంగా మారడం లాంటివి గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. దీని బట్టి గ్రహణ ప్రభావం అనేది మానవుల మీదనే కాకుండా, జంతువులు, కీటకల మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారు చెబుతున్నారు.

Read More..

600 ఏళ్ల పాటు అస్సాంను పాలించిన థాయ్‌లాండ్‌ వాసి.. ఏ వంశం వారో తెలుసా..

Advertisement

Next Story

Most Viewed