Nomophobia : అర్ధరాత్రి దాటినా ఆగట్లేదు.. గంటల తరబడి ఫోన్లు చూస్తూ..

by Javid Pasha |
Nomophobia : అర్ధరాత్రి దాటినా ఆగట్లేదు.. గంటల తరబడి ఫోన్లు చూస్తూ..
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ మానవ జీవితంలో ఎంత గొప్ప మార్పు తెచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం లేవగానే సరికొత్త సమాచారంతో మనల్ని అలరిస్తున్న గ్రేట్ కమ్యూనికేటర్ కూడా ఇదే. అనేక విషయాలు తెలుసుకోవడంలో, క్షణాల్లో సందేశాలు చేరవేయడంలో, సమాచార అభివృద్ధిలో మానవ ప్రమేయాన్ని మరింత సులభతరం చేసింది. ఒక విధంగా చెప్పాలంటే లైఫ్‌లో విడదీయలేని భాగమైపోయింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేనిదే ఏ పనీ జరగట్లేదు. ఇదంతా నాణానికి ఒకవైపు.. కానీ మరోవైపు ఇది పలు సమస్యలకు కూడా కారణం అవుతోందని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం.

అతి నిద్ర, అతి తిండి, అతి ఆలోచనలు ఏ విధంగానైతే మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయో, స్మార్ట్ ఫోన్ అతి వాకడం కూడా అట్లనే ఎఫెక్ట్ చూపుతుంది. రాత్రింబవళ్లు గంటల తరబడి స్ర్కోల్ చేస్తుండంవల్ల పిల్లల్లో, పెద్దల్లో, యువతలో ఇది వ్యసనంగా మారుతోందని నిపుణులు అంటున్నారు. ఇటీవల వెలువడిన ఒక అధ్యయనంలోనూ అదే వెల్లడైంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారని, 2022 సంవత్సరంతో పోల్చితే యువత స్మార్ట్‌ఫోన్‌లలో సమయం 39% పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. విషయం ఏంటంటే.. పదేండ్ల వయస్సు నుంచి 40 ఏండ్ల వయస్సు లోపు ఉన్నవారిలో 89 శాతం మంది అర్ధరాత్రి దాటినా ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇటీవల వయస్సుతో నిమిత్తం లేకుండా కూడా స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరిలో ఈ వ్యసనం పెరిగిపోతున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

రీసెంట్ సర్వే ప్రకారం.. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న వ్యక్తులు సగటున ఒక రోజుకు 150 సార్లు తమ ఫోన్లను అన్‌లాక్ చేస్తున్నారు. 95% మంది పిల్లలు మొబైల్ ఫోన్‌లలో వీడియో గేమ్స్ వంటివి ఆడుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు, యువత అందరూ కలిపి 62 % మంది ఇంటర్నెట్‌ బ్రౌజ్ చేస్తుండగా.. 89 % యువత పర్సనల్ అండ్ సెక్స్ రిలేటెడ్ విషయాలను ఆన్‌లైన్ వేదికగా డిస్కషన్ చేయడంలో, ఇతరుల డిస్కషన్లను చదవడంలో మునిగితేలుతోంది.

అర్ధరాత్రి దాటాక కూడా స్మార్ట్ ఫోన్లలో నచ్చిన కంటెంట్ ఫాలో అవుతూ, స్ర్కోల్ చేస్తూ గడిపేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ సందర్భంలో 37% మంది తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను బెడ్‌పైనే పెట్టుకుని నిద్రలోకి జారుకుంటున్నారు. 33.3 % మంది వ్యక్తులు అర్ధరాత్రి దాటాక కూడా మధ్యలో లేచినప్పుడల్లా ఇన్‌స్టా, వాట్సాప్, వివిధ సోషల్ మీడియా సైట్లను చెక్ చేస్తున్నారట. క్రమంగా ఇది స్ర్కీన్ వ్యసనానికి దారితీయడంతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావాలకు కారణం అవుతోంది. అనేకమంది నోమోఫోబియా(మొబైల్ ఫోన్ కనెక్టివిటీ నుంచి విడదీయబడతాం అనే భయం)తోపాటు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మెంటల్ డిజార్డర్లు, డిసీజ్‌లను ఎదుర్కొంటున్నారు. అందుకే అవసరానికి మించి స్మార్ట్‌ఫోన్ అడిక్ట్ కాకుండా తగిన కేర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed