Skin health : చలికాలంలో చర్మ సంరక్షణకోసం గ్లిజరిన్.. అతిగా వాడితేనే ప్రమాదం!

by Javid Pasha |
Skin health : చలికాలంలో చర్మ సంరక్షణకోసం గ్లిజరిన్.. అతిగా వాడితేనే ప్రమాదం!
X

దిశ, ఫీచర్స్ : అసలే వింటర్ సీజన్. తరచుగా బయటి వాతావరణంలో తిరిగే వారికి ఈ సీజన్‌లో పలు చర్మ సమస్యలు తలెత్తే చాన్స్ ఎక్కువ. ముఖ్యంగా చలిగాలికి గురికావడంవల్ల కాళ్లు, చేతులు, ముఖం, పెదవులపై పగుళ్లు ఏర్పడుతుంటాయి. చూడ్డానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి చాలా మంది ఈ సీజన్‌లో వివిధ క్రీములు, వాజిలెన్స్‌, రోజ్ వాటర్, గ్లిజరిన్ వంటివి వాడుతుంటారు. వీటివల్ల స్కిన్‌పై తేమ నిలుపుకోవడంవల్ల స్కిన్ పాడవకుండా ఉంటుంది. కానీ ఎక్కువగా ఉపయోగించడం కూడా అంత సేఫ్ కాదంటున్నారు నిపుణులు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

పెదవులు, చర్మం పగుళ్లపై గ్లిజరిన్‌ను సరైన మోతాదులో ఉపయోగించడంవల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో లో మాలిక్యులర్ ఉంటుంది. స్కిన్‌ లోపలికి చొచ్చుకుపోయిన దుమ్ము, ధూళి కణాలను క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. ఇదొక మంచి క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది. ఇక నిద్రపోవడానికి ముందు గ్లిజరిన్‌ను ముఖంపై అప్లై చేసుకుంటే సూక్ష్మ రంధ్రాలను శుభ్రపరుస్తుందని చెప్తారు. దీంతోపాటు చర్మం నిగారింపు పెరుగుతుంది. అయితే ఇదంతా పరిమితిగా ఉపయోగించినప్పుడు మాత్రమే. చలికాలం కదా చర్మం మెరిసిపోవాలనే ఉద్దేశంతో అతిగా ఉపయోగిస్తే గనుక అసలుకే మోసం రావచ్చు. చర్మం నల్లబడటం లేదా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు అంటున్నారు డెర్మటాలజిస్టులు. కాబట్టి ఉపయోగించడానికి ముందు మీ చర్మ తత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. స్కిన్ స్పెషలిస్టుల సలహాలు పాటించడం ఉత్తమం.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed