- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలా చేశారంటే 50 ఏళ్ల తర్వాత కూడా మీ చర్మం మెరిసిపోతుంది..
దిశ, ఫీచర్స్ : అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలుసు. అయితే ఇది మీ చర్మాన్ని మెరుగుపరుస్తుందని చాలా మందికి తెలిసి ఉండదు. అరటిపండులో కెరోటిన్, విటమిన్ ఇ, బి1, బి, సి పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా, వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం పై సహజమైన మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది. మీ చర్మం ముడతలు, మొటిమలతో ఇబ్బంది పడుతుంటే, మీరు ఈ అరటిపండు ఫేస్ ప్యాక్‌ని తప్పక ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. ఇది ముడతలను తగ్గించడమే కాకుండా ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అరటిపండు నుండి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
అరటిపండుతో పెరుగు, తేనె..
అరటిపండులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మం పై వచ్చే ముడతలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ సిద్ధం చేయడానికి మీరు పెరుగును ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అలాగే మచ్చల గుర్తులను కూడా లేకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇది చర్మం నుండి మృతకణాలను తొలగించడంలో, లోపల నుండి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తేనెను ఉపయోగించడం ద్వారా, చర్మ కణాలు రిపేర్ అవుతాయి. ఫైన్ లైన్స్ గుర్తులు కూడా తగ్గుతాయి. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా అరటిపండును బాగా మగ్గించండి. దీని తర్వాత అందులో 1 చెంచా తేనె, పెరుగు, నారింజ రసం కలపండి. ఇప్పుడు ఈ పేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. నేచురల్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి, ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు అప్లై చేయండి.
అరటి, రోజ్ వాటర్
అరటిపండు, రోజ్ వాటర్ తో సహజంగా కాంతివంతం చేసే ఫేస్ ప్యాక్‌ని సిద్ధం చేసుకోవచ్చు. అరటిపండులో ఉండే విటమిన్ ఇ, పొటాషియం ఒకవైపు చర్మం పై ముడుతలను తగ్గిస్తాయి. మరోవైపు రోజ్ వాటర్ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్‌తో చర్మం తాజాగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ సిద్ధం చేయడానికి, పండిన అరటిపండును బాగా మెత్తగా చేసి, ఆపై పచ్చి పాలు, రోజ్ వాటర్, చిటికెడు పసుపు జోడించండి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కొని, తేలికపాటి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2-3 సార్లు అప్లై చేయాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.