మిస్టరీని ఛేదించే ఆరు సైకలాజికల్ టిప్స్.. ఎవరు ఏమనుకుంటున్నారో కనిపెట్టేయోచ్చు..!

by sudharani |
మిస్టరీని ఛేదించే ఆరు సైకలాజికల్ టిప్స్.. ఎవరు ఏమనుకుంటున్నారో కనిపెట్టేయోచ్చు..!
X

దిశ, ఫీచర్స్: ప్రతి మనిషికి అవతల వ్యక్తులు మనసులో ఏం అనుకుంటారో తెలుసుకోవాలి అనిపిస్తుంటుంది. కానీ అది ఒక అంతుచిక్కని మిస్టరీగా భావిస్తారు. అయితే.. మనస్తత్వశాస్త్రం ప్రకారం మన చుట్టూ ఉన్నవారి ఆలోచనలు, రహస్యాలను కొన్ని టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం.

1. మిర్రరింగ్

మిర్రరింగ్ అనేది అవతల వ్యక్తి ప్రవర్తనను అనుకరించే సూక్ష్మ కళ. ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం & కనెక్షన్‌ని స్థాపించడానికి పవర్ ఫుల్ సాధనంగా ఇది పనిచేస్తుంది. కొందరు వ్యక్తులు తమ చుట్టూ ఉన్నవారిని అనుకరించడం, నిర్దిష్ట శరీర కదలికలతో సంబంధాలను ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ఇలా అనుకరించే సామర్థ్యం ఉన్నవారు ఎదుట వ్యక్తి భావోద్వేగాలను అర్థం చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తి సంభాషించేటప్పుడు మీరు వారిలా ప్రవర్తించినట్లుయితే వారి మనసులో భావాలు సులభంగా తెలుస్తాయి.

2. బాడీ లాంగ్వేజ్

ఒక వ్యక్తి మానసిక స్థితి వారి బాడీ లాంగ్వేజ్ ఆధారంగా తెలుసుకోవచ్చు. కదలిక అనేది విసుగు లేదా ఆసక్తి లేకపోవడాన్ని సూచిస్తుంది. ఏదైనా ఒక విషయంపై ఇన్‌ట్రెస్ట్ లేనట్లయితే బాడీలో మూమెంట్స్ చేంజ్ అవుతాయి. అలాగే కొంత మంది కదలికలు వారి తీవ్రమైన పరిస్థితుల్లో ఒత్తిడి లేదా ఆందోళనను కూడా సూచిస్తుంది. ఈ కారణంగా వారి మానసిక పరిస్థితిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

3. హెడ్ మూమెంట్స్

ఇద్దరి వ్యక్తల మధ్య సంభాషణల సమయంలో తల ఊపడాన్ని గమనించండి. వారికి ఇష్టమైతే హెడ్ మూమెంట్ ఒకలా ఉంటుంది. లేకపోతే విపరీతమైన వణుకు, అంతర్లీన ఆందోళనకు గురవుతునట్లు తల ఊపుతారు. ఏది ఏమైనప్పటికీ, అప్పుడప్పుడు తలవంచడం శ్రద్ధ, అంగీకారించడాన్ని ప్రదర్శిస్తుంది. ఇలా హెడ్ మూమెంట్స్‌ను బట్టి ఎదుటి వ్యక్తుల కంఫర్ట్‌ను గ్రహించవచ్చు.

4. ఫీట్ పాయింటింగ్

పాదాల అడుగులను బట్టి కూడా వ్యక్తుల మనస్థత్వాలను ఈజీగా కనిపెట్టవచ్చు. ఒక వ్యక్తితో మీరు మాట్లాడుతున్నప్పుడు సూక్ష్మ సూచికగా వారి పాదాల దిశను గమనించండి. వారి పాదాలు మీ వైపు చూపితే, అది స్వాగతాన్ని, శ్రద్దను సూచిస్తుంది. అయితే పాదాలను పక్కకు తిప్పడం పట్ల ఆసక్తి లేనట్లు అర్థం.

5. బ్లింకింగ్

రెప్పపాటు యొక్క ఫ్రీక్వెన్సీ, వేగం ఒకరి భావోద్వేగ స్థితి గురించి తెలుపుతోంది. సాధారణంగా నిమిషానికి ఆరు నుంచి ఎనిమిది సార్లు కనురెప్పలు కదుల్చుతారు. అయితే మితిమీరిన రెప్పపాటు భయాన్ని, ఆందోళనను, మోసాన్ని సూచిస్తుంది. ఈ కనురెప్పల మూమెంట్ ఒక వ్యక్తి అంతర్గత ఆలోచనలు, ఉద్దేశాల గురించి తెలుపుతోంది.

6. వాయిస్ టోన్

వ్యక్తుల మానసిక స్థితి వారి వాయిస్‌ను బట్టి కూడా ఒక అవగాహనకు రావొచ్చు. సంభాషణల సమయంలో అవతలి వారి టోన్ లేదా పిచ్‌లో ఆకస్మిక మార్పు వచ్చినట్లు అయితే వారు అసౌకర్యంగా ఫీల్ అవుతన్నారని లేదా ఇంట్రెస్ట్ లేదని సూచిక.

Advertisement

Next Story

Most Viewed