- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Seasonal effect : దోమలతో సీజనల్ వ్యాధుల వ్యాప్తి.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లతో పోలిస్తే వర్షాకాలంలో దోమల బెడద పెరుగుతుంది. ఇవి పిల్లలకు, పెద్దలకు కుట్టడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువ. కాబట్టి వాటి బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను దోమల నుంచి రక్షించడంలో పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలో చూద్దాం.
నిండైన దుస్తులు
వర్షాకాలంలో దోమల సంఖ్య పెరుగుతుంది. అవి ఒంటిపై వాలితే పెద్దలకైతే విషయం అర్థమై వెంటనే దుప్పటి కప్పుకోవడమో, దోమల బ్యాట్‌తో వాటిని చంపడమో చేస్తారు. కానీ చిన్న పిల్లలకు అలాంటివి తెలియవు కదా.. దోమలు కుట్టినా అలాగే ఉండిపోతారు లేదా ఏడవడం మొదలు పెడతారు. కొన్నిసార్లు ఎంత జాగ్రత్త తీసుకున్నా పేరెంట్స్ నిద్రపోయినప్పుడు పిల్లలకు దోమలు కుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటిలో దోమ తెరలు వాడటం లేదా పిల్లలకు కాళ్లు, చేతులు, మొత్తం చర్మం కప్పబడేలా నిండైన దుస్తులు వేయడం వల్ల దోమల నుంచి రక్షణ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కలర్ ఫుల్‌గా ఉండే బట్టలకు దోమలు త్వరగా ఆకర్షితమవుతాయి. కాబట్టి వానాకాలంలో లైట్ కలర్ దుస్తులు వాడితే బెటర్.
మస్కిటో రెప్పలెంట్
చిన్నారులను దోమల నుంచి కాపాడే మరో అవకాశం మస్కిటో రెప్పలెంట్ వాడటం. ముఖ్యంగా డీట్ ఉండే వాటిని ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్కిన్‌కు లైట్‌గా అప్లై చేసినా దోమలు కుట్టకుండా ఉంటాయి. పిల్లలు ఆరు బయట ఆడుతున్నప్పుడు, బడికి వెళ్లేటప్పుడు కూడా ఈ రెప్పలెంట్స్ అప్లై చేస్తే దోమలు కుట్టే చాన్స్ ఉండదు.
నిద్రపోయే సమయంలో..
పగలు లేదా రాత్రిళ్లు అయినప్పటికీ మెలకువగా ఉన్నంత సేపు దోమలు కుట్టకుండా జాగ్రత్త పడతాం. కానీ నిద్రలో ఉన్నప్పుడు అవి కుడతాయి. కాబట్టి పడుకునే ముందే దోమ తెరలు కట్టడం సరిచేసుకోవడం చేయడం బెటర్. సాయంకాలం నుంచే కిటికీలు, డోర్లు తెరిచి ఉంచకపోవడం వంటివి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనవి. దీంతో దోమల బారి నుంచి పిల్లలను రక్షించవచ్చు.
పరిసరాల పరిశుభ్రత
నీరు నేలపై లేదా గుంతల్లో నిల్వ ఉండే అవకాశం ఉన్న చోట, అపరిశుభ్రత కలిగినచోట దోమల సంఖ్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లో అలాంటి అవకాశం లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇంటి ముందు, చుట్టు పక్కల ఖాళీ డ్రమ్ములు, మట్టి కుండలు వంటివి ఉన్నా దోమలకు నివాసంగా మారుతాయి. కాబట్టి వాటిని తొలగించాలి. నీటి సంపులను ఎప్పుడూ మూసి ఉంచాలి. దీంతో దోమలు పెరగకుండా ఉంటాయి. కాబట్టి పిల్లకు పరోక్షంగా రక్షణ కల్పించినట్లే. అలాగే దోమలు వికర్షితం అయ్యే లావెండర్, తులసి వంటి మొక్కలను కూడా ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.