- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓజోన్ పొరకు చిల్లు.. మరో యాభై ఏళ్లలో మూసుకోవచ్చు : సైంటిస్టులు
దిశ, ఫీచర్స్: సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై సమస్త జీవులకు రక్షణనిచ్చేది ఓజోన్ పొర. కానీ 20వ శతాబ్దం చివరలో కొన్ని హానికరమైన రసాయనాలతో కూడిన మానవ ఉద్గారాలు వాతావరణంలోని ఓజోన్ అణువుల సంఖ్యను ప్రభావితం చేయడం ప్రారంభించాయి. ఇలా ప్రతి ఏటా ఎదురవుతున్న సంక్లిష్టమైన వాతావరణ, రసాయన ప్రక్రియల వల్ల అంటార్కిటికాపై ఒక రంధ్రం తెరుచుకుంటోంది. 1987లో మానవ నిర్మిత రసాయనాలు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్న ఏడేళ్ల తర్వాత వాతావరణంలోని హానికరమైన రసాయనాల మొత్తాన్ని అరికట్టేందుకు మాంట్రియల్ ప్రోటోకాల్‌పై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి.
గతంలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, హెయిర్ స్ప్రే, ఇండస్ట్రియల్ క్లీనింగ్ ప్రొడక్ట్స్‌లో కనిపించే ఈ రసాయనాలను ఓజోన్ పొరను రక్షించేందుకు గాను దశలవారీగా తొలగించడం ప్రారంభించారు. మొత్తం 197 పార్టీలు ఇందుకోసం అంగీకరించగా.. ఐక్యరాజ్య సమితి చరిత్రలో సార్వత్రికంగా ఆమోదించబడిన మొట్టమొదటి ఒప్పందాల్లో ఇదీ ఒకటి. కాగా ఇటీవల USలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్(NOAA) చేసిన కొత్త పరిశోధనలో ఓజోన్ పొరను దెబ్బతీసే హానికరమైన రసాయనాల సాంద్రతలు పడిపోయాయని కనుగొన్నారు.
ఓజోన్ పొర పునరుద్ధరణలో సాధించిన ప్రగతి?
1980తో పోలిస్తే స్ట్రాటో అట్మాస్పియర్ మిడ్ లెవెల్‌లో హానికరమైన రసాయనాల సాంద్రతలు 50 శాతానికి పైగా తగ్గాయని NOAA శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రికవరీ దిశలో ఈ మార్పును గుర్తించదగిన మైలురాయిగా పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ హానికర రసాయనాల వాతావరణ స్థాయిలు క్షీణించడం కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. అంటార్కిటికాపై రసాయనాల సాంద్రతలు పడిపోతున్నాయి కానీ ఫలితాల రేటు చాలా నెమ్మదిగా ఉన్నట్లు తెలిపారు. 2021లో పరిమాణంలో ఖండం కంటే పెద్దగా ఉన్న ఈ హోల్ నుంచి.. ఓజోన్ పొర 2070 నాటికి పూర్తిగా కోలుకోగలదని NOAA అంచనా వేసింది.
3D ఇమేజింగ్ ద్వారా పర్యవేక్షణ
ఓజోన్ పొరకు సంబంధించిన ఈ హోల్ పూర్తిగా మూసుకుపోయే వరకు కోపర్నికస్ అట్మాస్పియర్ మానిటరింగ్ సర్వీస్(CAMS) ద్వారా ట్రాక్ చేయబడుతుంది. సాధారణంగా ఈ రంధ్రం దక్షిణ అర్ధగోళంలో వసంతకాలంలో(ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు) ఏర్పడటం ప్రారంభమవుతుంది. సెప్టెంబరు-అక్టోబరు మధ్య దాని గరిష్ట పరిమాణాన్ని చేరుకుంటుంది. ఆపై డిసెంబర్ చివరి నాటికి ఓజోన్ స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి. కాగా ఈ ఏడాది CAMS శాస్త్రవేత్తలు త్రీ-డైమెన్షనల్ మోడలింగ్‌ను ఉపయోగించి ఆగస్టు చివరి నుంచి ఈ రంధ్రం అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఒకటి కాదు.. రెండు కాదు.. అక్కడ ఎన్నో అందాలు