- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బల్బు చుట్టూ కీటకాలు ఎందుకు తిరుగుతాయి?.. కనిపెట్టేసిన శాస్త్రవేత్తలు
దిశ, ఫీచర్స్: సమ్మర్‌లో మన ఇంట్లో ఉండే బల్బ్ లేదా ట్యూబ్ లైట్ చుట్టూ కీటకాలు తిరుగుతుండటం గమనించారా? ఇవి ఎందుకు ఇలా అట్రాక్ట్ అవుతాయనే సందేహం కలిగిందా? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు కొన్ని సమాధానాలిచ్చారు. తమ ప్రయాణానికి మార్గనిర్దేశం చేసేందుకు కాంతి వనరులపై ఆధారపడతాయనేది ఒక సిద్ధాంతం. కాగా నావికులు తమ నౌకలను నావిగేట్ చేసేందుకు నక్షత్రాలపై ఎలా ఉపయోగపడతారో.. పురుగులు కూడా చంద్రుడు, సూర్యుడు వంటి సహజ కాంతి వనరులపై డిపెండ్ అవుతాయి. ఇంట్లో లైట్‌ను చూసిన కీటకాలు.. ఆ కాంతి సూర్యుడు లేదా చంద్రుడు అనుకుని పొరపాటున అక్కడికి చేరుకుంటాయి. కాదని తెలుసుకుని గందరగోళానికి గురవుతున్న సమయంలోనే అలా లైట్ చుట్టూ తిరగడం ప్రారంభిస్తాయి.
* ఇక మరో సిద్ధాంతం ప్రకారం కీటకాలు పువ్వుల నుంచి తేనెను స్వీకరిస్తాయి. ఇవి అతినీలాలోహిత కాంతిని ప్రతిబింబిస్తాయి. అలాగే కొన్ని లైట్ బల్బులు అతినీలాలోహిత కాంతిని తక్కువ మొత్తంలో విడుదల చేయడం వలన ఆకలితో ఉన్న పురుగులు బల్బును పువ్వుగా పొరపాటు పడతాయి.
* శత్రువుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కూడా పురుగులు లైట్ చుట్టూ తిరుగుతాయనే సిద్ధాంతం ఉంది. రాబోయే ప్రమాదం నుంచి ఎస్కేప్ అయ్యేందుకు కాంతి కీటకాలకు సిగ్నల్ ఇస్తుంది. అందుకే కీటకాలు లైట్‌ను చూసినప్పుడు.. ప్రిడేటర్ ఉన్నాడనే సంకేతాన్ని ఇస్తుందనుకుని అక్కడికి చేరుకుంటాయి. ఆ విధంగా లైట్ సోర్స్(బల్బు, లాంతర్లు)లోకి ఎగురుతాయి.
* ఆర్టిఫిషియల్ లైట్, క్యాంప్ ఫైర్స్‌కు అట్రాక్ట్ అవుతున్న కీటకాలు.. భోజనం కోసం వేటాడేవి కావచ్చు. లేదంటే అక్కడికి ముందుగానే చేరుకున్న ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నవి అయుండొచ్చు.
* అయితే తాజ అధ్యయనం ప్రకారం ఖగోళ నావిగేషన్‌తో పాటు ఎస్కేప్ మెకానిజంలో కాంతిని ఉపయోగిస్తాయి. పూర్తిగా మూసివేసిన ప్రదేశాల్లో బయటకు వెళ్లేందుకు ఎక్కడ ఖాళీలు ఉన్నాయో కాంతి చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.