అన్ని బంధాల్లో సంతృప్తి ఉంటేనే.. చివరి రోజుల్లో ఆరోగ్యం

by Vinod kumar |   ( Updated:2023-02-23 14:07:47.0  )
అన్ని బంధాల్లో సంతృప్తి ఉంటేనే.. చివరి రోజుల్లో ఆరోగ్యం
X

దిశ, ఫీచర్స్: భాగస్వాములు, కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులతో మనోహరమైన సంబంధాలను ఆస్వాదించే మధ్య వయస్కులు వృద్ధాప్యంలో మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని తాజా అధ్యయనం చెబుతోంది. గుడ్ సొసైటీ సర్కిల్‌ను ఆస్వాదించడం వల్ల వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించే అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపింది.


వృద్ధాప్యంలో అనారోగ్యాలను నివారించడానికి భాగస్వాములు, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులతో సంతృప్తికరమైన సంబంధాలను కలిగి ఉండాలి. 40-50 ఏళ్ళలో ఈ సంబంధాలు ఎంత తక్కువ సంతృప్తికరంగా ఉంటే.. జీవితంలో తర్వాత అనేక అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం కనుగొంది. 11 సాధారణ దీర్ఘకాలిక పరిస్థితుల నుంచి విముక్తి పొందిన ఆస్ట్రేలియాలోని 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల దాదాపు 8,000 మంది మహిళల నుంచి డేటాను పరిశీలించింది.


ఇక ఈ అధ్యయనం 1996లో ప్రారంభమైంది. ప్రతి మూడు సంవత్సరాలకు.. వారు తమ భాగస్వాములు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో తమ సంతృప్తి స్థాయిలను నివేదించారు. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఆస్తమా, డిప్రెషన్ లేదా యాంగ్జయిటీ వంటి వృద్ధాప్య రోగాలు వారికి సంక్రమించాయా లేదా తెలుసుకునేందుకు 20 సంవత్సరాలు తనిఖీ చేశారు. అత్యున్నత స్థాయి సంతృప్తిని నివేదించిన వారితో పోలిస్తే.. వారి సామాజిక సహచరులతో అత్యల్ప స్థాయి సంతృప్తిని అనుభవించిన వారికి అనారోగ్య పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదం రెట్టింపు ఉంటుందని అధ్యయనం కనుగొంది.

ఇవి కూడా చదవండి:

మీకు ఇలాంటి కలలు వచ్చాయా.. ష్.. ఎవరికీ చెప్పకూడదంట!

Advertisement

Next Story