1.5 టన్నుల టమోటాలతో శాంతాక్లాజ్ సైకత శిల్పం

by Nagaya |   ( Updated:2022-12-25 12:52:25.0  )
1.5 టన్నుల టమోటాలతో శాంతాక్లాజ్ సైకత శిల్పం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచ‌వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. క్రిస్మస్ సంబరాల నేపథ్యంలో ఒడిశా పూరీకి చెందిన అంతర్జాతీయ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ భారీ శాంతాక్లాజ్‌ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని గోపాల్‌పూరీ బీచ్‌లో టమాటాల‌తో భారీ శాంటాక్లాజ్ బొమ్మ గీశాడు. ఇసుకతో పాటు 1500 కిలోల(1.5 టన్నులు) టమోటాలతో శాంతాక్లాజ్​ను తయారు చేశారు. దాని ప‌క్కన మెర్రీ క్రిస్మస్ అని కూడా టమాటాలతో రాశాడు. ఈ శిల్పం 27 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు ఉన్న శాంతాక్లాజ్ బొమ్మ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. దీనికి 15 మంది శిష్యులు సహకరించారని సుదర్శన్‌ పట్నాయక్‌ వివరించారు. టమోటాలతో చేసిన ఈ భారీ శాంతాక్లాజ్ శిల్పంతో వ‌రల్డ్ రికార్డు క్రియేట్ చేస్తాన‌ని సుద‌ర్శన్ చెప్పారు.

Advertisement

Next Story