Dark Circles: పాలు, తేనెతో డార్క్ సర్కిల్స్ మాయం.. ఏం చేయాలంటే..?

by Kanadam.Hamsa lekha |
Dark Circles: పాలు, తేనెతో డార్క్ సర్కిల్స్ మాయం.. ఏం చేయాలంటే..?
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ డిజిటల్ వస్తువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అవి కళ్ల సమస్యలకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్లు, ఫోన్లు, టెలివిజన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు నుంచి వెలువడే కాంతి కళ్లకు హాని కలిగిస్తుంది. వీటి కారణంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. అధిక ఒత్తిడి, నిద్రలేమి, శరీర శ్రమ ఇలా చాలా కారణాలతో ఈ నల్లటి మచ్చలు వస్తాయి. కంటి చుట్టూ ఉన్న డార్క్ మెరూన్ ఆర్బిక్యులారిస్ ఓక్యులి కండరం ప్రతిబింబించడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ వస్తాయి. అయితే, చాలామంది వీటిని తగ్గించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, పాలను ఉపయోగించి ఈ డార్క్ సర్కిల్స్‌ను పూర్తిగా తొలగించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చదివేయండి.

చాలామందికి డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖంలో అందం తగ్గుతుంది. ఆడవాళ్లు అయితే వీటిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, కేవలం పాలతోనే డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ చర్మానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. పాలలో లాక్టిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది. అంతేకాకుండా డెడ్ స్కిల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల చర్మం తాజాగా, అందంగా కనిపిస్తుంది.

పాలు, తేనే: ముందుగా పాలలో కొంచెం తేనెను కలిపి నల్ల మచ్చలపై రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాలు చర్మంపై మంటను తగ్గించి, స్కిన్ టోన్‌‌ను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. పాలు, బాదం నూనె కలిపి ఉపయోగించినా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

పాలు, పసుపు: పసుపులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. పాలను, పసుపుతో కలిపి రాస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు తగ్గిపోతాయి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

రోజ్ వాటర్: చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను తగ్గించడంలో రోజ్ వాటర్ సహాయపడుతుంది. ఇది స్కిన్ టోనర్‌గా బాగా పనిచేస్తుంది. రోజ్ వాటర్‌లో కాటన్ ఐ ప్యాడ్‌లను 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత దానిని కళ్లపై పెట్టుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ప్రయోజనం ఉంటుంది.

పాలు, కాటన్ ప్యాడ్: ముందుగా పాలను తీసుకొని అందులో ఒక కాటన్ ప్యాడ్‌ను వేసి ఒక నిమిషం తరువాత ఆ కాటన్ ప్యాడ్‌ను కళ్లపై పెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. కొద్ది సేపటి తరువాత సున్నితంగా మసాజ్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.

టమాట: టమాటలు సహజ బ్లీచింగ్ ఏజెంట్లు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కళ్ల చుట్టూ ఉన్న నలుపును తగ్గించడంలో సహాయపడతాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Advertisement

Next Story

Most Viewed