జిమ్‌కు వెళ్లకుండానే బాడీ బిల్డింగ్.. పుషప్స్‌తో పంజాబ్ కుర్రాడి గిన్నిస్ రికార్డ్!

by Hamsa |
జిమ్‌కు వెళ్లకుండానే బాడీ బిల్డింగ్.. పుషప్స్‌తో పంజాబ్ కుర్రాడి గిన్నిస్ రికార్డ్!
X

దిశ, ఫీచర్స్ : బాడీబిల్డప్ చేయాలంటే.. జిమ్‌కు వెళ్లడం, అందుకు తగిన వర్క్‌వుట్స్, డైట్ వంటివి చేయాల్సి ఉంటుంది. అదే పుషప్స్‌లో ఓ రికార్డ్ కొట్టాలంటే.. అందుకు ఎక్స్‌పర్ట్ కోచ్ ఆధ్వర్యంలో ఉత్తమ శిక్షణ పొందాల్సిన అవసరముంది. కానీ ఓ పంజాబీ యువకుడు ఒక్కరోజు కూడా వ్యాయామశాలకు వెళ్లకుండా వేళ్లపై అత్యధిక పుష్-అప్స్ చేసి గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

పంజాబ్, గుర్దాస్ పూర్ జిల్లా ఉమ్రావాలా గ్రామానికి చెందిన కువార్ అమృత్ వీర్ అనే పందొమ్మిదేళ్ల యువకుడు ఒక నిమిషంలో క్లాప్స్‌తో(వేళ్ల చిట్కాలు) 45 పుష్-అప్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. సింగ్ ఈ ఫీట్ సాధించేందుకు రోజుకు నాలుగు గంటలపాటు 21 రోజులు సాధన చేసినట్లు వెల్లడించాడు. అంతేకాదు కసరత్తులు చేసేందుకు జిమ్‌కు వెళ్లకపోగా, ప్రత్యేక శిక్షకుడిని కూడా నియమించుకోకపోవడం విశేషం. అయితే రికార్డ్ కోసం గిన్నిస్ నిపుణుల ఆధ్వర్యంలో 2020 జులై, సెప్టెంబర్‌లో వరుసగా ఒక నిమిషంలో అత్యధిక నకుల్ పుష్-అప్స్(knuckle), 30 సెకన్లలో అత్యధిక సూపర్‌మ్యాన్ పుప్-అప్స్ చేసి రికార్డ్ సృష్టించాడు.

గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న సింగ్ తన కసరత్తులు కోసం ఇటుకలు, సిమెంట్, ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలు మొదలైన వాటిని ఉపయోగించి తనే వర్కవుట్‌కు సంబంధించిన పరికరాలు తయారు చేసుకోవడం విశేషం. 'ఎలాంటి డైట్ ఫాలో కాలేదు. ప్రొటీన్ సప్లిమెంట్లను కూడా ఉపయోగించలేదు. కేవలం ఇంట్లో వండిన ఆహారం తింటూ.. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటివి డైట్‌లో భాగం చేసుకున్నాను. దేశంలోని యువతను ఫిట్‌నెస్ విషయంలో ఉత్సాహపరుస్తా. వారికి స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటాను' అని కువార్ అమృత్ వీర్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed