PALM RUBBING - BRAIN : అర చేతులను ఇలా రుద్దితే సక్సెస్ మీ సొంతం..

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-11 07:28:50.0  )
PALM RUBBING - BRAIN : అర చేతులను ఇలా రుద్దితే సక్సెస్ మీ సొంతం..
X

దిశ, ఫీచర్స్: అరచేతులను రుద్దడం అనేది ఒక పవర్ ఫుల్ టెక్నిక్. సంస్కృతీ సంప్రదాయాల్లో పాతుకుపోయిన ఈ పురాతన పద్ధతి.. తరచుగా విస్మరించబడుతుంది. చలికాలంలో పామ్ రబ్బింగ్ వెచ్చదనాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని తెలుసు కానీ దీనివల్ల మానసిక ఉల్లాసం, ప్రశాంతమైన నిద్ర వంటి అనేక బెనిఫిట్స్ ఉన్నాయని సూచిస్తున్నారు నిపుణులు. ఫాలో అయితే బ్రెయిన్ సూపర్ పవర్ తో పని చేస్తుందని చెప్తున్నారు.

మానసికంగా రిఫ్రెష్

మీ అరచేతులను కలిపి రుద్దడం వల్ల రక్త ప్రసరణ, శక్తి ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. మానసికంగా అలిసిపోయినట్లు లేదా పనిపై ఫోకస్ చేయలేకపోతున్నట్లు అనిపిస్తే.. పామ్ రబ్బింగ్ చేయమని సూచిస్తున్నారు నిపుణులు. దీనివల్ల వెంటనే ఏకాగ్రత తిరిగి పొందుతారని, ఆలోచనలకు పదునుపెడుతారని చెప్తున్నారు.

ఆందోళన, ఒత్తిడి దూరం

మీ అరచేతులను ఒకదానితో మరొకటి లయబద్ధంగా రుద్దడం ధ్యానం మాదిరిగా పని చేస్తుంది. ఈ ప్రాక్టీస్ ద్వారా ఉత్పన్నమయ్యే వెచ్చదనం నాడీ వ్యవస్థపై ఓదార్పు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి లాంటి శారీరక లక్షణాలు తగ్గించి... మనస్సును శాంత పరుస్తుంది. పనిపై దృష్టి పెట్టేందుకు.. ఒత్తిడితో కూడిన ఆలోచనల నుంచి విడిపోయేందుకు హెల్ప్ చేస్తుంది.

మానసిక సమతుల్యత

ఈ టెక్నిక్ ద్వారా విడుదలయ్యే శక్తి, వెచ్చదనం హృదయ చక్రాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. ఇది భావోద్వేగ శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. ఆ పవర్ సెంటర్ ను ఉత్తేజ పరచడం ద్వారా ఎమోషనల్ బ్లాకేజేస్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతర్గత శాంతిని పెంపొందిస్తుంది.

ఇన్‌స్టాంట్ ఎనర్జీ

సంప్రదాయ చైనీస్ వైద్యం ప్రకారం పామ్ రబ్బింగ్ శక్తి ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. శరీరంలో శక్తి నిల్వలను పునరుజ్జీవింప చేస్తుందని నమ్ముతారు. ఈ చలనం ద్వారా ఉత్పన్నమయ్యే వేడి ఇంద్రియాలను మేల్కొలుపుతుంది. తక్షణ శక్తిని అందిస్తుంది.

పసిపాపలా పడుకోవచ్చు

అరచేతులను రుద్దడం నాడీ వ్యవస్థపై ప్రశాంతత ప్రభావం కలిగిస్తుంది. మనస్సు, శరీరాన్ని విశ్రాంతి కోసం సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. పడుకునే ముందు ఈ టెక్నిక్ యూజ్ చేస్తే పసిపాప మాదిరిగా నిద్రించవచ్చు. శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది.

బాడీ, మైండ్ కనెక్షన్

పామ్ రబ్బింగ్ వల్ల చేతుల్లో కలిగే సెన్సేషన్స్.. అప్రమత్తంగా, అవగాహనతో ఉండేలా చేస్తుంది. ఈ మూమెంట్ లో ఉండేలా రిమైండర్ గా వర్క్ అవుతుంది. బాడీ, మైండ్ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed