చెట్లకు పాయిజన్ సెలైన్స్.. ప్రపంచంలో ఖరీదైన కలప సృష్టికి..

by Vinod kumar |   ( Updated:2022-11-08 15:04:10.0  )
చెట్లకు పాయిజన్ సెలైన్స్.. ప్రపంచంలో ఖరీదైన కలప సృష్టికి..
X

దిశ, ఫీచర్స్: ఇటీవల చెట్ల కొమ్మలకు సందేహాస్పద ద్రవంతో నిండిన పెద్ద పెద్ద IV డ్రిప్స్ వేలాడుతున్న ఫొటోలు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది అటవీ నిర్మూలన లేదా మానవ నిర్మిత కాలుష్యం వల్ల నాశనమవుతున్న మొక్కల గురించి అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ అని కొందరు ఆశ్చర్యపోయారు. మరికొందరు శిలీంధ్రాలు లేదా ఇతర పరాన్నజీవుల నుంచి చెట్లను రక్షించేందుకు రూపొందించిన జెన్యూన్ ట్రీట్మెంట్ మెథడ్ అనుకున్నారు. కానీ తాజాగా ఈ అపోహలన్నీ తప్పని తేలింది.

వాస్తవానికి 'రోడ్ అబ్జర్వేషన్ అకాడమీ' ఫేస్‌బుక్ గ్రూప్‌లో పోస్ట్ చేయబడిన రెండు ఫొటోల్లో చెట్ల కొమ్మల నుంచి డజన్ల కొద్దీ పెద్ద IV సంచులు, చెట్టు కాండాల్లోకి జొప్పించిన పెద్ద సూదులతో ఆకుపచ్చ ట్యూబ్స్ నుంచి వేలాడదీయబడ్డాయి. ఇది చెట్టు యొక్క స్వీయ-రక్షణ యంత్రాంగాన్ని యాక్టివేట్ చేయడానికి, తద్వారా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కలపను సృష్టించేందుకు రూపొందించిన విష ప్రయోగమని స్పష్టమైంది. ఇందుకోసం IV డ్రిప్స్‌ను సాధనంగా ఉపయోగిస్తున్నారు.


ఆసియాలో కైనామ్ లేదా 'క్యారా' అని పిలవబడే అరుదైన అగర్వుడ్(ఔడ్)ను బలమైన సువాసన కోసం పెర్‌ఫ్యూమ్, ధూపం పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఆక్విలేరియా చెట్టు యొక్క ఈ హార్ట్‌వుడ్ సాపేక్షంగా వాసన లేనిది. కానీ కొన్ని పరిస్థితుల్లో ఈ చెట్టు ఒక రకమైన డార్క్ రెసిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అది విలువైన అగర్వుడ్‌ను సృష్టిస్తుంది. ఇక్కడే IV థెరపీని ఉపయోగిస్తున్నారు. వందల ఏళ్లుగా ఆక్విలేరియా ఒక రకమైన ఒత్తిడికి ప్రతిస్పందనగా అగర్వుడ్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని మానవులకు తెలుసు. అయితే ఇది ఇటీవలే 'ఫియలోఫోరా పారాసిటికా(ఒక రకమైన అచ్చు)'గా గుర్తించబడింది. ఒకానొక సమయంలో విలువైన రెసిన్ ఉత్పత్తిని ప్రేరేపించేందుకు ఈ పరాన్నజీవితో అక్విలేరియా చెట్లను కృత్రిమంగా సంక్రమించవచ్చని తెలిసింది.

ఇప్పుడు ఇండోనేషియా నుంచి మయన్మార్, వియత్నాం వరకు ఆసియా అంతటా అగర్వుడ్ తోటలు ఉన్నాయి. అయితే సాధారణంగా తోటల్లో పెంచిన అగర్వుడ్.. అడవి జాతి అగర్వుడ్ వలె ఖరీదైనది కాదు. ఎందుకంటే అడవి జాతి చెట్లు వందల ఏళ్ల నాటివి. ఇది నేటికీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పదార్థాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది.

ఇవి కూడా చదవండి :

Health tips: బాడీ హీట్ ఎక్కువగా ఉందా..? ఇలా సహజంగా తగ్గించుకోండి..

Advertisement

Next Story

Most Viewed