- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లేట్‌లెట్స్ తగ్గిపోయాయా.. అయితే వీటిని కచ్చితంగా తినాల్సిందే!
దిశ, ఫీచర్స్: వర్షాకాలం వాతావరణంలో జరిగే మార్పుల వల్ల చాలా మంది జబ్బుల బారిన పడుతుంటారు. జలుబు, దగ్గు, జ్వరం, న్యూమోనియా, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా వానాకాలం దోమల బెడద జనాలను నానా తంటాలు పడేలా చేస్తాయి. అయితే దోమలు కుట్టడం వల్ల ప్రమాదకరమైన డెంగ్యూ విజృంభించి పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే డెంగ్యూ వచ్చిన వారిలో ఎక్కువగా ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా మానవ శరీరంలో ప్రతి ఒక్కరికి 4 లక్షల ప్లేట్‌లెట్స్ ఉండాలి. కానీ డెంగ్యూ వచ్చిన వారిలో తగ్గడం వల్ల రక్తస్రావం అయి చాలా వీక్ అవుతారు. దీంతో ఏది తినాలన్నా భయపడిపోతారు. అయితే ప్లేట్‌లెట్స్ పెంచుకునే ప్రయత్నం చేసే వారు ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కాస్త మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
*వర్షాకాలం అనేక రకాల కూరగాయలు లభించినప్పటికీ అన్ని తినకూడదు. ఎందుకంటే కొందరికి పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ల సలహాలు, సూచనల మేరకు వ్యాధుల బారిన పడకుండా తింటుంటారు. అయితే ప్లేట్‌లెట్స్ స్థాయిలు తగ్గినవారు పాలకూర తినాలి. ఇందులో ఉండే విటమిన్లు ప్లేట్‌లెట్స్‌ను పెంచడానికి సహాయపడతాయి.
* అలాగే గుమ్మడి గింజలను చాలా మంది తినడానికి ఇష్టపడరు కానీ వాటి వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటిల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి తినడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచుతాయి. అలాగే పలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. గుమ్మడి గింజలు తీసుకోవడం మంచిది.
* బీట్ రూట్ మట్టి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని తినడానికి సంకోచిస్తుంటారు. కానీ ఇందులో ఉండే పోషకాలు, విటమిన్లు శరీరానికి చాలా మేలు చేస్తాయని మర్చిపోతారు. అలా పచ్చిగా తినాలనిపించకపోతే కూర వండుకుని అయినా సరే తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జ్వరంతో ప్లేట్‌లెట్స్ పడిపోయిన వారికి బీట్ రూట్ జ్యూస్ బెస్ట్.
* ప్లెట్‌లెట్స్ పెంచడానికి దానిమ్మ ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తం పెరగడంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుతుంది.
* బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా మేలు చేకూరుతుంది. అలాగే పండే కాకుండా బొప్పాయి కాయలు, ఆకుల్లోనూ బోలెడు ప్రయోజనాలు దాగున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, అల్కాలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ప్లేట్‌లెట్స్ పెరగడానికి దోహదం చేస్తాయి.
* అలాగే డ్రై ఫ్యూట్స్‌లో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నవారికి ఎండు ద్రాక్ష పెట్టాలి. రాత్రంతా నానబెట్టుకుని వాటిని ఉదయం తినడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరగుతుంది. అయితే వర్షాకాలం వ్యాధులు రాకుండా మనల్సి మనం కాపాడుకోవాలంటే విటమిన్ సి కలిగిన ఆహారాలు తీసుకోవడం బెటర్.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. దీనిని పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించాము.