Egyptian pyramids: ఈజిప్టు పిరమిడ్ల చుట్టూ వింత బుడగలు.. గ్రహంతర వాసుల పనేనా?

by Javid Pasha |   ( Updated:2024-09-18 14:24:41.0  )
Egyptian pyramids: ఈజిప్టు పిరమిడ్ల చుట్టూ వింత బుడగలు.. గ్రహంతర వాసుల పనేనా?
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలో మనల్ని ఆకట్టుకునే వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. పురాతన కట్టడాలు, అద్భుతమైన నిర్మాణాలు ఆకట్టకుంటాయి. అలాంటి వాటిలో పరిమిడ్లు కూడా ఒకటి. అయితే వీటికి సంబంధించి ప్రస్తుతం ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏంటంటే.. ఇటీవల కాలంలో ఈజిప్టులోని పిరమిడ్ల చుట్టూ వింతైన వస్తువులు లేదా ఆకారాలు తేలుతున్నట్లుచైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘లాట్టిట్యూడ్ లాంగ్ రేంజ్ అయానోస్పిరిక్ రాడార్’ అనే అడ్వాన్స్ టూల్‌ని ఉపయోగించి కనుగొన్న వీటిని ‘ప్లాస్మా బబుల్స్’గా పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇది ఏలియన్స్ పనే అయి ఉంటుందని పలువురు ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలా ఏర్పడతాయి?

నిజానికి ప్లాస్మా బుడగలు లేదా బబుల్స్ వంటివి ఏర్పడటానికి సైంటిఫిక్ కారణాలు ఉంటాయి అంటున్నారు పరిశోధకులు. భూ ఎగువ వాతావరణంలో ఏర్పడే వీటిలో ఇవి సంభవిస్తాయని, వీటిలో ఎలక్ట్రాన్ల వంటి చార్జ్‌డ్ పార్టికల్స్ ఉంటాయని చెప్తున్నారు. అదీగాక ఈ కణాలు డే టైమ్‌లో సూర్యుడి వేడి, శక్తి ద్వారా క్రియేట్ అవుతాయి. ఇక రాత్రివేళల్లో లేదా సౌర తుఫానులు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సహజంగానే అవి సూర్యుడి నుంచి పొందిన శక్తిని కోల్పోతాయి. దీంతో వాటి స్థానంలో ఖాళీ ప్రదేశం లేదా బుడగ మాదిరి ఏర్పడుతుంది. ఇక ఇవి కనిపించే ఏరియాలో చుట్టు పక్క ప్రాంతాల వాతావరణంతో పోల్చినప్పుడు ఇక్కడ తక్కువస్థాయి ఎలక్ట్రాన్లు ఉంటాయి. అయితే ఈజిప్ట్‌లో మాత్రమే ఇలా జరగడం లేదని, యూఎస్ నేవీ స్థావరాల్లోని ద్వీపాల్లోనూ కనిపస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

సవాళ్లు ఎదురైతే..

పిరమిడ్ల చుట్టూ ప్లాస్మా బబుల్స్ ఏర్పడటం వల్ల ప్రమాదం లేనప్పటికీ అవి జీపీఎస్, శాటిలైట్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆటంకాలు సృష్టించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా సముద్రాల్లో పలు సవాళ్లు ఎదురు కావచ్చు. అయితే వీటిని అధిగమించేందుకు కూడా సైంటిస్టులు ప్లాన్ చేస్తున్నారు. లో లాట్టిట్యూడ్ ఏరియాల్లో 3 నుంచి 4 వరకు (Low Lattitude Long - Range Lonospheric Radar (LARID) స్టేషన్ల నెట్వర్క్‌లను నిర్మించడం వల్ల ప్లాస్మా బుడగలవల్ల తలెత్తే ఇబ్బందులను అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయానికి రాలేదు. ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


Read More...

Trending : లైట్ ఆన్ చేయడమే ఉద్యోగం.. జీతం రూ. 30 కోట్లు.. వెంటనే కావలెను !

Advertisement

Next Story