- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Intra circle roaming : ఫోన్ ఉంటే చాలు.. సిగ్నల్ లేకున్నా కాల్ చేయవచ్చు!

దిశ, ఫీచర్స్ : మనం ఎవరికైనా కాల్ చేసి మాట్లాడాలంటే చేతిలో ఫోన్ ఉన్నంత మాత్రాన సరిపోదు. యూజ్ చేస్తున్న సిమ్ కార్డ్‌కు సంబంధించిన నెట్వర్క్ కూడా సరిగ్గా ఉండాలి. కానీ కొన్నిచోట్ల అలాంటి పరిస్థితిలేక వినియోగదారులు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో, కొండ ప్రాంతాల్లో సిగ్నల్ సరిగ్గా రాక అవస్థలు పడుతుంటారు. అయితే ఇక నుంచి మారుమూల గ్రామాల్లోనూ అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అంటున్నారు సాంకేతిక నిపుణులు. అదెలా సాధ్యమో చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం టెలికం రంగంలో ఇటీవల ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఫీచర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్ నుంచి తాము వాడుతున్న సిమ్ నెట్‌వర్క్ సిగ్నల్ లేకపోయినా, అందుబాటులో ఉండే ఇతర నెట్‌వర్క్‌ల సాయంతో కాల్ చేసుకునే వెసులు బాటు ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ యూజర్లు సొంత నెట్వర్క్ లేని ఏరియాల్లో దీనిని యూజ్ చేసుకోవచ్చు. అంటే సంబంధిత టవర్లు అందుబాటులోలేకుంటే ఐసీఆర్ ఫీచర్‌తో అదర్ నెట్వర్క్‌ల సిగ్నల్స్ ద్వారా ఎంచక్కా కాల్ చేసుకోవచ్చు. కాగా ఈ ఫీచర్ డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) ద్వారా ఏర్పాటైన 4జీ టవర్ల పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ డీబీఎన్ టవర్లను దేశ వ్యాప్తంగా 35,400 మారుమూల గ్రామాల పరిధిలో, మొత్తం 27 టవర్లను ఏర్పాటు చేసింది. భవిష్యత్‌లో మరింత విస్తరించే అవకాశముందని నిపుణులు అంటున్నారు.