Pet dogs : ఏసీ కోచ్‌లో ప్రయాణించిన కుక్క.. అది చేసిన పనికి అందరూ ఫిదా.. ఏం చేసిందంటే..

by Javid Pasha |
Pet dogs : ఏసీ కోచ్‌లో ప్రయాణించిన కుక్క.. అది చేసిన పనికి అందరూ ఫిదా.. ఏం చేసిందంటే..
X

దిశ, ఫీచర్స్ : ట్రైన్ స్పీడుగా కదులుతోంది. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లోని ప్రయాణికుల్లో కొందరు నిద్రపోతున్నారు. మరి కొందరు కిటికీ వద్ద కూర్చొని బయటకు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తు్న్నారు. ఇంకొందరు ఓకేదగ్గర ఎంతసేపు కూర్చుకుంటామని అటూ ఇటూ తిరుగుతున్నారు. అయితే ఇంతలోనే తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్న ప్రయాణికులందరినీ ఓ స్పెషల్ బెర్త్‌లోని దృశ్యం ఆకట్టుకుంది. అది చూసిన ప్రతి ఒక్కరి పెదవులపై చిరనవ్వు, మొహంలో సంతోషం కనిపించాయి. ఇంతకీ ఆ దశ్యమేంటి.. అక్కడేం జరిగింది? అనే కదా మీ సందేహం? మరేం లేదు.. అక్కడో స్టైలిష్ డాగ్ కనిపించింది. దానికో ప్రత్యేకత ఉంది.

కుక్కలంటే కొందరికి భయం అయితే, మరికొందరికి ప్రేమ. ప్రస్తుతం చాలామంది పెట్ డాగ్స్‌ను పెంచుకుంటూ తమ ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకోవడం మీరు గమనించే ఉంటారు. విశ్వాసానికి మారు పేరుగా కుక్కలు మంచి గుర్తింపును కూడా పొందాయి. ఈ కారణంగా పెంపుడు కుక్కలను చాలామంది ఇష్టపడుతుండగా.. అవి కరిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని రోడ్లపై తిరిగే వీధి కుక్కలను చూసి కొందరు భయపడుతుంటారు. ఇదంతా పక్కన పెడితే కుక్కలు కూడా మనుషుల్లా గవర్నమెంట్ జాబుల్లో పనిచేయడం, నేర పరిశోధనల్లో కీలకపాత్ర పోషించడం తెలిసిందే.

ఇండియన్ ఆర్మీలో వీర జవాన్లతోపాటు డాగ్స్ కూడా కీ రోల్ పోషిస్తాయి. తాజాగా ఏసీకోచ్‌లో ప్రయాణించే కుక్క ఆ కోవకు చెందినదే. 22 ఆర్మీ డాగ్ యూనిట్‌కు చెందిన ‘మేరు’ అనే తొమ్మిదేళ్ల ట్రాకర్ డాగ్ ఒకటి మీరట్‌ ఆర్‌వీసీ సెంటర్‌లోని వెటర్నరీ కార్ప్స్‌లో ఉండే డాగ్స్ రిటైర్మెంట్ హోమ్‌కు వెళ్లేందుకు అధికారులు దానికి ట్రైన్‌లోని ఏసీ కోచ్‌లో స్పెషల్ బెర్త్ బుక్ చేసి పంపించారు. అది జర్నీలో ఉన్నప్పుడు కూడా కాసేపు నిద్రపోతూ, మరి కాసేపు కోచ్ కారిడార్‌లో షికారు చేస్తూ తన డ్యూటీ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. చూసిన వారంతా ‘క్యూట్.. గ్రేట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed