పాండమిక్.. పర్సనాలిటీస్‌ మార్చిందా?

by Hamsa |
పాండమిక్.. పర్సనాలిటీస్‌ మార్చిందా?
X

దిశ, ఫీచర్స్ : మనలో కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు జీవితాంతం కొనసాగితే.. మరికొన్ని మాత్రం క్రమంగా మారతుంటాయి. అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒత్తిడి లేదా గాయాన్ని ప్రేరేపించే కీలక సంఘటనలు వ్యక్తిత్వాల్లో మరింత వేగవంతమైన మార్పులతో సంబంధం కలిగి ఉంటాయని కొత్త అధ్యయనం చెబుతోంది. ఇటీవలి కాలంలో కొవిడ్ మహమ్మారి.. ఊహించిన దానికంటే కూడా వ్యక్తిత్వంలో చాలా ఎక్కువ మార్పులను ప్రేరేపించిందని సూచిస్తోంది. ముఖ్యంగా పాండమిక్ ముందు కాలంతో పోలిస్తే 2021, 2022లో.. ప్రజల్లో బహిర్ముఖత, దాపరికంలేని గుణం, ఆస్వాదించే స్వభావం తగ్గడంతో పాటు మనస్సాక్షిగా వ్యవహరించలేకపోతున్నారని పరిశోధకులు కనుగొన్నారు.

ఈ అధ్యయనంలో యూఎస్‌కు చెందిన 18 నుంచి 109 ఏళ్ల మధ్య వయసు గల 7,000 మంది పాల్గొన్నారు. 'బహిర్ముఖత(extroversion) Vs అంతర్ముఖత(introversion), అంగీకారం Vs విరోధం, మనస్సాక్షికి Vs దిశ లేకపోవడం, న్యూరోటిసిజం(కోపం, చిరాకు) Vs భావోద్వేగ స్థిరత్వం, ఓపెన్‌నెస్ Vs అనుభవానికి దగ్గరగా ఉండటం' వంటి ఐదు కోణాల్లో వీరి వ్యక్తిత్వాన్ని లెక్కగట్టారు. అయితే, ప్రీ-పాండమిక్‌‌దో పోలిస్తే 2021/2022లో బహిర్ముఖత, ఓపెన్‌నెస్, అంగీకారం, మనస్సాక్షిలో గరిష్ట క్షీణత నమోదైంది. ఈ మార్పులు ఒక దశాబ్దపు సాధారణ వైవిధ్యానికి సమానంగా ఉన్నాయి. మొత్తానికి కొవిడ్ మహమ్మారి మిగిల్చిన గాయం.. వ్యక్తిత్వ మార్పులో సహజ ప్రక్రియను వేగవంతం చేసిందని ఇది సూచిస్తోంది. ఆసక్తికరంగా.. ఈ అధ్యయనంలో యువకుల వ్యక్తిత్వాలు చాలా మారాయి. వారు అంగీకారం, మనస్సాక్షిలో క్షీణతను చూపించారు. అయితే ప్రీ-పాండమిక్‌తో పోలిస్తే 2021/2022లో కోపం, చిరాకు వంటి భావోద్వేగ అస్థిరత విషయంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. రెండేళ్ల సాధారణ స్థితిని కోల్పోయి తిరిగి సమాజంలోకి ఎదుగుతున్నప్పుడు తలెత్తే సామాజిక ఆందోళనే ఇందుకు కొంత కారణం కావచ్చు.

వ్యక్తిత్వం, శ్రేయస్సు

పాండమిక్ టైమ్‌లో చాలా మందిలో ఆరోగ్యం(పౌష్టికాహారం, వ్యాయామం చేయడం) పట్ల అవగాహన పెరిగింది. అదే క్రమంలో వర్చువల్‌గా సాధ్యమయ్యే సామాజిక సంబంధాల కోసం వెతకడం మొదలైంది. ఈ మేరకు సరికొత్త స్కిల్స్ నేర్చుకోవడం లేదా కొత్త అభిరుచులను ఎంచుకోవడం ద్వారా మానసిక, భావోద్వేగ, మేధోపరమైన ఎదుగుదలపై మళ్లీ ఫోకస్ చేసేందుకు ప్రయత్నించాం. అయినప్పటికీ మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు గణనీయంగా తగ్గింది. ప్రధానంగా ఇక్కడ వ్యక్తిత్వమే శ్రేయస్సును గరిష్టంగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు : మనస్సాక్షితో వ్యవహరిస్తూ అంగీకారం లేదా బహిర్ముఖతను నివేదించే వ్యక్తులు అత్యధిక శ్రేయస్సును అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అధ్యయనంలో గుర్తించబడిన వ్యక్తిత్వ మార్పులు పాండమిక్ టైమ్‌లో మనం చూసిన శ్రేయస్సులో తగ్గుదలను వివరించేందుకు ఒక మార్గంగా మారవచ్చు.

పాండమిక్‌‌లో ప్రతికూలంగా ప్రభావితమైన విషయాలు :

* ఇతరుల పట్ల సానుభూతి, దయను వ్యక్తపరచగల సామర్థ్యం(అంగీకరించడం);

* కొత్త భావనలకు, వినూత్న పరిస్థితులలో(ఓపెన్‌నెస్) నిమగ్నమవ్వడానికి ఇష్టపడే సామర్థ్యం;

* ఇతరుల కంపెనీని వెతకడం, ఆనందించే ధోరణి(బహిర్గతం);

* లక్ష్యాల కోసం కృషి చేయాలనే కోరిక, పనులను చక్కగా చేయడం లేదా ఇతరుల పట్ల బాధ్యతలను తీవ్రంగా పరిగణించడం(మనస్సాక్షి).

ఈ లక్షణాలన్నీ మన చుట్టూ ఉన్న పర్యావరణంతో మన పరస్పర చర్యను ప్రభావితం చేస్తాయి. ఇవి మన శ్రేయస్సు క్షీణతలో పాత్ర పోషించి ఉండవచ్చు. ఉదాహరణకు : వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కెరీర్ ముందుకు సాగడం లేదు(తక్కువ మనస్సాక్షి) అని మనం డిమోటివేట్ అయ్యుండవచ్చు. ఇది మనల్ని మరింత చిరాకు, నిస్పృహ లేదా ఆత్రుతగా భావించేలా చేయడం ద్వారా శ్రేయస్సును ప్రభావితం చేసి ఉండవచ్చు.

తర్వాత ఏంటి?

కాలక్రమేణా మన వ్యక్తిత్వాలు వృద్ధాప్యానికి అనుగుణంగా మారడానికి, జీవిత సంఘటనలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సాయపడతాయి. మరో మాటలో చెప్పాలంటే.. జీవితానుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం, ఇది వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వయసులో సాధారణంగా ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ, భావోద్వేగ స్థిరత్వం పెరగడాన్ని చూస్తాం. కానీ ఈ అధ్యయనంలో పాల్గొనేవారి వ్యక్తిత్వంలో మాత్రం సాధారణ పథానికి వ్యతిరేక దిశలో మార్పులు నమోదయ్యాయి. దీనికి పరిమిత స్వేచ్ఛ, ఆదాయాన్ని కోల్పోవడం, అనారోగ్యం సహా చాలా కాలం ఇబ్బందులు ఎదుర్కోవడమే మూలమని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ అనుభవాలన్నీ స్పష్టంగా మనల్ని, మన వ్యక్తిత్వాలను మార్చేశాయి.

ఈ ప్రభావాలు తదనంతరం మన జీవితంలోని శ్రేయస్సు వంటి అనేక అంశాలను ప్రభావితం చేయొచ్చు. గత కొన్నేళ్లుగా అనుభవాలు, వ్యక్తిత్వ మార్పులు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేశాయో బేరీజు వేసుకునేందుకు సమయాన్ని వెచ్చించాలనుకోవచ్చు. పాండమిక్ పీక్ టైమ్‌లో ఏవైనా మార్పులు మిమ్మల్ని బాగా రక్షించి ఉండవచ్చు. ఇపుడు పరిస్థితులు మారినా ఆ మార్పులు ఇప్పుడు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో మీకు మీరే ప్రశ్నించుకోవడం విలువైనదే. లేదా పునరాలోచనతో మీ దృక్పథాన్ని మార్చుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed