ఈ సమస్యలు ఉన్నవారు విటమిన్ ఇ అసలు తీసుకోకూడదు.. ఎందుకంటే?

by Disha Web Desk 10 |
ఈ సమస్యలు ఉన్నవారు విటమిన్ ఇ  అసలు తీసుకోకూడదు.. ఎందుకంటే?
X

దిశ, ఫీచర్స్: విటమిన్ ఇ శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. చర్మ సంరక్షణకు ఇది ఉత్తమ విటమిన్. చర్మ సంరక్షణలో విటమిన్ ఇ యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి, కాబట్టి విటమిన్ ఇ ఖచ్చితంగా కాస్మోటాలజీలో ఉపయోగించబడుతుంది.

విటమిన్ ఇ చర్మ సంరక్షణకు, అందానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే విటమిన్ ఇని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. విటమిన్ ఇ చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. యవ్వనంగా, అందమైన చర్మానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ E యొక్క ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే, కొంతమంది విటమిన్ ఇ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ ఇ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తాయి. దీంతో చర్మంపై ముడతలు, మొటిమలు తొలగిపోతాయి. విటమిన్ ఇ సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మనలో కొందరికి చర్మ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఎగ్జిమా, సోరియాసిస్ ఉన్న వారు విటమిన్ ఇ తీసుకోకూడదు. లేదంటే దురద, మంట పెరగవచ్చు. ఆలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు విటమిన్ ఇ తీసుకోకూడదు. రక్తాన్ని పలుచన చేసే మందులు వాడే వాళ్ళు, కొలెస్ట్రాల్ మందులు వాడేవారు విటమిన్ ఇ తీసుకోకూడదు.

Next Story

Most Viewed