ఆ పని చేసి అలసిపోయిన సురేఖ.. దుబాయ్ ట్రిప్‌కు తీసుకెళ్తున్న చిరు!

by Disha Web Desk 8 |
ఆ పని చేసి అలసిపోయిన సురేఖ.. దుబాయ్ ట్రిప్‌కు తీసుకెళ్తున్న చిరు!
X

దిశ, సినిమా : మెగా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరు ఎప్పుడూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అయితే ఇటీవల ఉపాసన తన అత్తయ్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా అత్తమ్మ కిచెన్స్ అంటూ ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె తాజాగా అత్తయ్య ఆవకాయ పట్టచడి అంటూ మరో వీడియోను అత్తమ్మ కిచెన్స్ ద్వారా షేర్ చేశారు. ఇందులో ఆవకాయ పచ్చడి ఎలా చేయాలి అనే విషయాలను, సురేఖ తయారు చేస్తూ చెప్పుకొచ్చారు.

అయితే ఇలా పచ్చటి పెట్టిన తర్వాత ఉపాసన తన అత్తయ్యని చూపిస్తూ ఏంటీ అత్తయ్య మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగ్గా.. నేను ఇక చెట్నీ పెట్టి అలసిపోయానని మీ మామయ్య దుబాయ్ హాలిడే ట్రిప్ తీసుకెళ్తున్నాడంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల తెగ వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన నెటిజన్స్ ఆవకాయ పెడితేనే దుబాయ్ తీసుకెళ్తే ఇంకా, ఏదైనా పెద్ద పని చేస్తే ఇంకెక్కడికి తీసుకెళ్తారో.. ఎంతైనా చిరు ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ.. ఎప్పుడూ అలానే కలిసి ఉండాలి వీరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వడం వలన దుబాయ్ ట్రిప్ వెళ్తున్నట్లు సమాచారం. కాగా, విశ్వంభర మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More..

మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్స్ కూడానా..? అయ్య బాబోయ్ ఈ ట్వీస్ట్ మాములుగా లేదుగా

Next Story

Most Viewed