- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని పనులు.. తప్పక తెలుసుకోండి
దిశ, ఫీచర్స్: పెద్దలు పిల్లల ముందు ప్రవర్తించే విధానాన్నే వారు ఫాలో అయిపోతారు. పెద్దయ్యాక అలాగే తయారవుతారు. పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులే కాబట్టి పేరెంట్స్ వారి ముందు అగౌరవంగా మాట్లాడితే అదే ఫాలో అయిపోతారు. కాస్త ఎదిగాక తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడతారు. దీంతో పేరెంట్స్ వారిని తిట్టడం మొదలెడతారు. కానీ అది చాలా తప్పు అని.. దాని వల్ల పిల్లలు మరింత దిగజారిపోతారని అంటున్నారు నిపుణులు. పిల్లలు పద్ధతిగా పెరగాలంటే తల్లిదండ్రులు వారి ముందు ఈ 5 పనులు చేయకుండా ఉంటే చాలని చెప్తున్నారు.
1. అబద్ధాలు చెప్పడం
చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలు దాచడానికి అబద్ధం చెప్పమని పిల్లలకు నేర్పుతారు. పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారంటే భవిష్యత్తులో కూడా అలవాటు పడిపోతారు. దీని వల్ల తప్పు చేసి తప్పించుకోడానికి, చెడు మార్గంలో వెళ్లేందుకు పునాది పడుతుంది. దీంతో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
2. క్రమశిక్షణ
ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణా రాహిత్యంతో అస్సలు ప్రవర్తించకూడదు. తల్లిదండ్రులు ఏ విధంగా మెదిలితే వారు కూడా అదే ఉదాహరణగా తీసుకుని, పిల్లలు కూడా అలానే ఉంటారు. కనుక మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి పని వారికి ఉపయోగకరంగా ఉండాలి. ముఖ్యంగా పెద్దవారితో, స్నేహితులతో, కొత్తవారితో, ఎలా నడుచుకోవాలో నేర్పించాలి. నేటి తరం పిల్లలకు తెలివితేటలు ఎక్కువైపోయాయి కానీ వాటిని ఎలా ఉపయోగించాలి, ఎవరి మందు చూపించాలి తెలిసేలా పెంచాలి. తప్పు చేసిన వెంటనే వారిపై అరిచేయకుండా.. ముందు ఏం జరిగిందో అడిగి తెలుసుకుని తర్వాత మందలించాలి. అప్పుడే పిల్లల్లో క్రమశిక్షణ అలవడుతుంది.
3. అసభ్యంగా ప్రవర్తించడం
పిల్లల ముందే భార్యాభర్తలు అసభ్యంగా ప్రవర్తించకూడదు. వారి ముందు ఒకరినొకరు పట్టుకోవడం, ఇతరత్రా పనులు చేయడం లాంటివి చేయడం వల్ల పిల్లల మైండ్‌లో అదే ఉండిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉండే చిలిపి చిలిపి సరదాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లల ముందు చూపకూడదు. కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి పనులు చేయకూడదు. టీవీ చూస్తున్న సమయంలో అలాంటి సీన్స్ వచ్చినా స్కిప్ చేయాలి.
4. పిల్లల ముందు గొడవ పడరాదు
దంపతుల మధ్య గొడవలు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ దెబ్బలాడుతూ ఉంటారు. ఈ సమయంలో ఒకరినొకరు అవమానించుకుంటారు. కానీ ఇదంతా పిల్లల ముందు కాకుండా నాలుగు గోడల మధ్య చూసుకుంటే బెటర్. ఎందుకంటే వారి ముందు మీరు గొడవలు పడటం వల్ల పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి భార్యాభర్తలు మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ పిల్లలకు తెలియకుండా పెంచాలి. అది తల్లిదండ్రుల మొదటి మంచి లక్షణం.
5. బూతులు మాట్లాడకూడదు
సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతున్నప్పుడు చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు వింటే తొందరగా నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొందరు చిన్నపిల్లల్లో ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి. ఏదైనా విన్నా, చూసినా గుర్తుపెట్టుకుంటారు. అందుకే వారి ముందు అగౌరవంగా, ముఖ్యంగా బూతులు మాట్లాడకూడదు.
మీరు పులిహోర కలిపే బ్యాచ్చేనా.. జర జాగ్రత్త పిల్లకాటు తప్పదంట!
అక్రమ సంబంధం ఉన్నట్లు తేలితే.. జాబ్ ఊడిపోయినట్లే.. కొత్త నిబంధన
అమ్మే సర్వస్వం.. ప్రపంచంలోనే బెస్ట్ మదర్స్‌గా ఫీలవుతున్న 73 శాతం మంది తల్లులు