- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలకు ఈ విషయాలను పేరెంట్స్ తప్పనిసరిగా నేర్పించండి..!
దిశ, ఫీచర్స్: తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితంలో ఉన్నతస్థాయికి రావాలని, వారి జీవితం అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు. అన్నింటిలోనూ విజయం సాధించాలని అనుకుంటారు. చిన్నప్పటి నుంచే తమ పిల్లల జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలని ఆలోచిస్తుంటారు. అయితే, పదేళ్ల లోపు పిల్లలకు కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పించాలంటున్నారు నిపుణులు. ఈ వయసు నుంచే వారికి సరైన నైపుణ్యాలను నేర్పించడం వల్ల వారు జీవితంలో విజయం సాధిస్తారు. అయితే, కొంతమంది పేరెంట్స్ అంటుంటారు.. చిన్నపిల్లలు ఇప్పుడేం నేర్చుకుంటారు, పెద్ద వాళ్లు అయితే వాళ్లకు అర్థమవుతుంది అని. కానీ, అది చాలా తప్పని చెబుతున్నారు. మరి పిల్లలకు నేర్పిచాల్సిన విషయాలు ఏంటో చూద్దాం.
పదేళ్లలోపు పిల్లలకు మైండ్ చాలా షార్ప్‌గా పనిచేస్తుంది. ఈ వయసులోనే వారు ఎక్కువగా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకే చిన్న వయస్సు నుంచే పిల్లలకు మంచి అలవాట్లను నేర్పించాలి. లేదంటే.. వాళ్లు పెద్దయ్యాక ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం లేదా చెప్పిన విషయాన్ని వినడం వారికి కష్టంగా ఉంటుంది.
ఈ విషయాలు తప్పనిసరిగా నేర్పించాలి:
సమస్య పరిష్కారం: పిల్లల వయస్సుకు తగిన కొన్ని సవాళ్లు, పజిల్స్ వంటివి వారికి ఎదురయ్యేలా చేయండి. దీని ద్వారా వారు ఆ సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్లు పెద్దవాళ్లు అయ్యాక సులభంగా సమస్యను పరిష్కరించడం నేర్చుకుంటారు.
మాట్లాడడం: పిల్లలు వారి ఆలోచనలను స్పష్టంగా తెలియజేయడం నేర్పించాలి. ఎటువంటి విషయాన్ని అయినా పేరేంట్స్‌తో చెప్పడం అలవాటు చేసేలా చేయాలి.
ఫెల్యూర్‌ను అధికమించడం: పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఆటల్లో ఓడిపోయినా వారిని ఉత్సాహపరచండి. ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే అని వారికి అర్థమయ్యేలా చేయండి.
బాధ్యత: వయస్సుకు తగినట్లుగా వారికి బాధ్యతలను నేర్పించాలి. చిన్న చిన్న పనులు స్వయంగా చేసుకోవడం నేర్పించాలి. వస్తువులను జాగ్రత చేసుకోవడం, చెప్పిన పనిని ఎలా పూర్తి చేయాలి వంటి విషయాలను నేర్పించాలి.
సానుభూతి: పిల్లలు ఇతరుల భావాలను అర్థం చేసుకోరు. వారికి అనిపించింది చేస్తుంటారు. దీని వల్ల ఒక్కొసారి ఇతర పిల్లలు బాధపడుతుంటారు. అలా కాకుండా వారికి ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు తెలియజేయాలి.
టైమ్ టేబుల్: జీవితంలో విజయం సాధించాలంటే టైమ్‌ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. దీన్ని పిల్లలకు నేర్పించండి. అందులో పిల్లలు ఏ పని చేయాలి, ఎంతసేపు చేయాలి అని చెప్పిండి. ప్రతీ రోజూ ఇలా టైమ్‌కి చేయడం అలవాటు చేయండి. అయితే, ఒక్కసారిగా ఇలా చేయమని బలవంతపెట్టకండి. నిదానంగా పని చేయడం అలవాటు చేయించండి. అంతేకాకుండా.. డబ్బును ఆదా చేయడం, ఖర్చు చేయడం వంటివి తప్పనిసరిగా నేర్పించాలి. ఇలా అలవాటు చేయడం వల్ల వారు కష్టకాలంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా ఉంటారు.