పాతకాలం పద్ధతులు ఈ జనరేషన్ పిల్లలకు పేరెంట్స్ నేర్పించాల్సిందే!

by Anjali |
పాతకాలం పద్ధతులు ఈ జనరేషన్ పిల్లలకు పేరెంట్స్ నేర్పించాల్సిందే!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పుట్టుకతోనే వారికి అన్ని తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తరచూ స్మార్ట్ ఫోన్లు, టీవీ, కంప్యూటర్లకే పరిమితమవుతున్నారు. చిన్నపిల్లలైతే ఫోన్ ఇస్తే కానీ ఫుడ్ తినడం లేదు. చేతికి ఫోన్ ఇస్తే చాలు.. ఎక్స్‌ఫర్ట్‌గా ఆపరేట్ చేస్తున్నారు. కాగా చిన్నపిల్లలు మొబైల్స్‌కు అడక్ట్ అయితే మెదడుపై ప్రభావం చూపుతుందని నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు.

అయితే ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారు. కానీ ఆ తప్పును యాక్సెప్ట్ చేయరు.. చేసిన తప్పును అంగీకరించే గట్స్ ఉండాలి. అది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. అలాగే కొన్ని పాత పద్ధతులను ఈ జనరేషన్ పిల్లలకు నేర్పించడం తప్పనిసరి.

ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. అలాగే వారు ఏమైనా కావాలని అడిగితే అది వెంటనే తమ దగ్గరకు రావాలి. వచ్చిన తర్వాత ఆ వస్తువును భద్రంగా దాచుకుంటారా? లేదు.. దాచుకునే అలవాటు కూడా ఉండదు. కాగా ఈ జనరేషన్ పిల్లలకు కాస్త ఓపిక, సేవ్ చేసుకోవడం నేర్పించాలి. ఏదైనా వస్తువు పాడైతే దాని ప్లేస్‌లో వెంటనే వేరేది కొనలాని థింక్ చేస్తారు. కొనేవరకు పేరెంట్స్‌ను ఇబ్బంది పెడుతుంటారు. కొత్తవి కొనుగోలు చేయకుండా పాత వస్తువునే రిపేర్ చేసుకుని ఎలా వాడాలో నేర్పించాలి.

అలాగే బంధువులను చిరునవ్వుతో పలకరించడం, చేసే పని చిత్త శుద్ధితో చేసేలా ప్రోత్సహించడం, గార్డెనింగ్ నేర్పించడం, (గార్డెనింగ్ వల్ల బాధ్యత, ఓపిక అలవాటు అవుతుంది. విత్తనం దగ్గర నుంచి అది మొక్కగా ఎలా అవుతుంది అనేది వారు ఓపికగా చూస్తారు) ఎదుటి వ్యక్తితో కాన్ఫిడెంట్‌గా మాట్లాడటం, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం, ఇంట్లో వారి పనులు వారే చేసుకోవడం.. ఇలా కొన్ని పాత పద్ధతులను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. వాటిని ఆచరించేలా చేయాలి. అప్పుడే వారు గొప్పగా ఆలోచిస్తారు. ఓపికను అలవాటు చేసుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed