Weight Loss : కొత్త సంవత్సరంలో అధిక బరువు తగ్గాలా..? ఇలా ప్లాన్ చేసుకోండి!

by Javid Pasha |   ( Updated:2024-12-31 12:25:51.0  )
Weight Loss : కొత్త సంవత్సరంలో అధిక బరువు తగ్గాలా..? ఇలా ప్లాన్ చేసుకోండి!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఈ సంవత్సరం నుంచైనా రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలని, వెయిట్ లాస్ అవ్వాలనే లక్ష్యాలను కూడా పెట్టుకున్నారు చాలామంది. అయితే ఇవి నెరవేరాలంటే.. ఏం చేయాలి? రోజూ ఎన్ని గంటలకు నిద్రలేవాలి? ఎలాంటి ఆహారలు తీసుకోవాలి? వంటి సందేహాలు కూడా ఉంటాయి. వీటికి నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

*న్యూ ఇయర్‌లో బరువు తగ్గాలనే మీ లక్ష్యం నెరవేరాలంటే.. ముందుగా అందుకోసం ఏం చేయాలనే ప్లాన్ రూపొందించుకోండి. అందుకు ఉపయోగపడే హెల్తీ ఫుడ్స్ ఏమిటి? ఏవి ఎప్పుడు తినాలాలి?, ఏ రకమైన వ్యాయామాలు చేయాలి? ఇలా.. ప్రతీ విషయం ప్లాన్ చేసుకోండి. ఒక పట్టికరూపంలో నోట్ తయారు చేసి కనిపించేలా ఇంట్లో పెట్టుకుంటే ప్రతిరోజూ దానిని చూసినప్పుడల్లా బరువు తగ్గాలనే ఆలోచన వస్తుంది. ఆటోమేటిగ్గా మీరు అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నిస్తారు.

*వెయిట్ లాస్ అవ్వాలంటే.. అంత ఈజీ కాదు, కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. జంక్ ఫుడ్స్, స్వీట్లు, వివిధ పానీయాలు నోరూరిస్తుంటే.. వాటిని తినకుండా ఉండలేరు చాలా మంది. ఇదే అధిక బరువు సమస్యకు కారణం అవుతుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. అధిక చక్కెరలు ఉన్నవాటిని తినకపోవడం మంచిది. అలాగే అతిగా నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటే మీరు అనుకున్నది సాధిస్తారు.

*ఒత్తిడి, ఆందోళన, అలసట వంటి అనారోగ్యాలు ఉన్నప్పుడు కూడా మీరు అధిక బరువు తగ్గాలన్న లక్ష్యాన్ని చేరుకోలేరు. కాబట్టి వీటిని గుర్తించి తగ్గించుకుంటేనే బెటర్. దీంతోపాటు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, చేపలు, మాసం వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటం కూడా ముఖ్యం.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed