- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచిస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి!
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రతీ చిన్న విషయానికి కూడా అతిగా రియాక్ట్ అవుతుంటారు. చిన్న సమస్యను కూడా భూతద్దంలో చూసి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఈ ఆలోచనలు చేసే వారు అనారోగ్యం బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందినా, పదే పదే ఎక్కువగా ఆలోచిస్తున్నా.. శారీరక, మానసిక సమస్యలకు కారణం అవుతుంది.
పాజిటివ్‌గా ఆలోచించడం అలవాటు చేసుకుంటే.. జీవితం పాజిటివ్‌గా సాగుతుంది. ఒకవేళ నెగిటివ్ థింకింగ్ ఎక్కువైతే అన్ని ఇబ్బందులుగానే, కష్టాలుగానే కనిపించి, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ మానసిక సమస్యలు తలెత్తితే ఎంత మందిలో ఉన్నా ఒంటరిగానే ఫీలవుతారు. వారిని ఒంటరితనం చుట్టుముట్టేస్తుంది. దీనివల్ల తీవ్ర ఒత్తిడికి గురి అవుతారు. క్రమంగా తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతారు. అందుకే దేని గురించి అయినా అవసరానికి మించి ఆలోచించకూడదు. అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఆరోగ్యానికే కాదు, శారీరక ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఓవర్ రియాక్ట్ వల్ల నిద్రలేమి, ఆందోళన, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది మెదడు కణాలపై ఒత్తిడిని పెంచి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.
ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయట పడాలంటే?
అతి ఆలోచనలు వేధిస్తున్నప్పుడు ఏదైనా సినిమా చూడండి. మహిళలైతే కొత్త వంటలు ప్రయత్నించండి. పెయింటింగ్, డాన్స్ వంటివి చేయండి. ఇతర ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఇష్టమైన పని చేస్తూ ఉండండి. ధ్యానం అనేది మనస్సును ప్రశాంతంగా ఉంచి, మైండ్‌ను కంట్రోల్ చేస్తుంది. చిన్న చిన్న తప్పుల విషయంలో ఎక్కువగా ఆలోచించకుండా వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. ఇలా చేస్తే ఒంటరితనం అనే ఫీలింగ్ రాదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అతిగా ఆలోచించడం మానేసి, భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించడకుండా ప్రస్తుత క్షణంలో సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.
Read More..
అఘోరా?! ఒరిజినల్ వర్సెస్ ఫేక్..!