- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిజిటల్ డివైజ్‌ల వాడకంతో 'జ్ఞాపకశక్తి'కి ప్రయోజనం
దిశ, ఫీచర్స్ : మొబైల్ ఫోన్ ఎంటర్ అయ్యాక ఎవరూ ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం లేదన్నది వాస్తవం. ఆ ఒక్క విషయంలోనే కాదు, కూరగాయలు, ఇంటి సామాన్ల లిస్ట్, మంత్లీ బడ్జెట్, అప్పుల వివరాలు, బర్త్ డేస్, పెళ్లిరోజులు, పండగలు, మీటింగ్స్ సహా మరెన్నో అంశాలను ఫోన్‌లోని ఫీడ్ ఆప్షన్ మనకు రిమైండ్ చేస్తుంది. దీంతో ఈ డిజిటల్ పరికరాల వల్ల మన జ్ఞాపకశక్తి సామర్థ్యం దెబ్బతింటుందనే వాదనలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని కొత్త అధ్యయనం సూచిస్తోంది. కొన్ని విషయాలు గుర్తుంచుకునేందుకు డిజిటల్ పరికరాన్ని ఉపయోగిస్తే మెదడుకు మొత్తంగా మరిన్ని విషయాలు జ్ఞాపకం ఉంచుకునే స్వేచ్ఛ లభిస్తుందని న్యూ రీసెర్చ్ వెల్లడించింది.
జర్మన్ న్యూరో సైంటిస్ట్ మాన్‌ఫ్రెడ్ స్పిట్జర్.. దాదాపు దశాబ్దం కిందట 'డిజిటల్ డిమెన్షియా' పదాన్ని ఉపయోగించాడు. డిజిటల్ పరికరాల మితిమీరిన వినియోగం జ్ఞాపకశక్తి క్షీణతకు దారితీస్తుందని హెచ్చరించాడు. ఫలితంగా ఆమ్నేషియా ఏర్పడుతుందని కూడా ప్రతిపాదించాడు కానీ తన వాదనకు ఎలాంటి శాస్త్రీయత ప్రతిపాదించలేకపోయాడు. అయితే డిజిటల్ డివైజెస్ వల్ల ఇతర విషయాలు ఆలోచించేందుకు మెదడులో ఖాళీ సమయం ఏర్పడి, అభిజ్ఞా సామర్థ్యాలు మెరుగుపడతాయని యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్‌కు చెందిన కాగ్నిటివ్ న్యూరో సైంటిస్ట్ క్రిస్ బర్డ్ పేర్కొన్నాడు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకుల నేతృత్వంలోని ఒక కొత్త అధ్యయనం ఈ విషయాన్ని ధృవీకరించింది. దీని కోసం ఒక ప్రత్యేకమైన మెమొరీ గేమ్‌ను అభివృద్ధి చేసిన పరిశోధకులు.. డిజిటల్ పరికరాల్లోని రిమైండర్లను వాడుకుంటూ, ఒక్కోసారి వాడకుండా కొంతమంది వలంటీర్లతో గేమ్ ఆడించారు. విచిత్రంగా డిజిటల్ రిమైండర్స్ సెట్ చేసినప్పుడు వారి ఫలితాలు పాజిటివ్‌గా ఉన్నట్లు వెల్లడైంది.
డిజిటల్ పరికరాన్ని ఉపయోగించడం వల్ల ప్రజలు అధిక-ప్రాముఖ్యత, తక్కువ-ప్రాముఖ్యత సమాచారాన్ని నిల్వ చేసే విషయంలో తమ మెమొరీని ఉపయోగించే విధానాన్ని మార్చారు. పరికరాన్ని ఉపయోగించగలిగినప్పుడు, అందులో అధిక-ప్రాముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేశారు. అదే తక్కువ ప్రాధాన్యత గల సమాచారాన్ని స్టోర్ చేసేందుకు సొంత మెమొరీని ఉపయోగించారు. ఏదేమైనా ముఖ్యమైన సమాచారాన్ని బ్యాకప్ చేసే విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఎప్పుడైనా మెమొరీ సాధనం విఫలమైతే, మన సొంత మెమొరీలో తక్కువ-ప్రాధాన్యత గల సమాచారం ఉంటుందే తప్ప మరేం మిగిలి ఉండదని గుర్తుంచుకోవాలి.
- సామ్ గిల్బర్ట్, సైంటిస్ట్