నిద్రపోతున్నప్పుడు మనలో స్పృహ ఎందుకు ఉండదు?.. బయటి శబ్దాలు ఎందుకని వినబడవు?

by Javid Pasha |   ( Updated:2024-03-18 07:54:49.0  )
నిద్రపోతున్నప్పుడు మనలో స్పృహ ఎందుకు ఉండదు?.. బయటి శబ్దాలు ఎందుకని వినబడవు?
X

దిశ, ఫీచర్స్ : సహజ సిద్ధమైన మానవ కార్యక్రమాల్లో నిద్ర ఒకటి. మనం ఎంత బాగా నిద్రపోతే అంత రిలాక్స్‌గా ఉంటాం. అలసిపోయినప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు మైండ్ పనిచేయదు. అలాంటప్పుడు కాసేపు నిద్రపోయి లేస్తే తిరిగి పుంజుకుంటాం. యాక్టివ్‌‌గా పనిలో నిమగ్నం అవుతాం. కానీ నిద్రలో ఉన్నప్పుడు మనకు ఎందుకని స్పృహ ఉండదు?, బయటి శబ్దాలు ఎందుకు వినపడవు? అదే సందర్భంలో ఏదైనా ప్రమాదకర శబ్దాలు వింటే ఎందుకని దిగ్గున లేచి కూర్చుంటాం? అప్పుడెలా మైండ్ పనిచేస్తుంది? అనే సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తుంటారు? నిపుణుల ప్రకారం.. ఇది మెదడు నిర్మాణానికి సంబంధించిన నేచురల్ రియాక్షన్.

వాస్తవానికి మనం నిద్రపోయినప్పుడు చెవులు సహజంగానే పనిచేస్తాయి. బయటి సమాచారం చెవుల ద్వారా మైండ్‌కి ప్రసారం అవుతుంది. అయితే అది నిద్రను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ మెదడు ఆ సంకేతాలను అడ్డుకుంటుంది. కాబట్టి మనకు బయటి శబ్దాలు వినపడవు. సందర్భాన్ని బట్టి సహజ సిద్ధంగా నిర్ధయం తీసుకునే సామర్థ్యం మెదడుకు ఉంటుందని, మన బ్రెయిన్ కెమిస్ట్రీ వ్యవస్థ అలా రూపొందించబడి ఉండటంవల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే మనం నిద్రలేవాలా.. వద్దా? అనేది కూడా బయటి సమాచారాన్ని గ్రహించినప్పుడు మెదడే తగిన నిర్ణయం తీసుకుంటుంది.

గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రమాదకరం కానటువంటి విషయాలను బ్రెయిన్ పట్టించుకోదు. ఈ కారణంగానే కొన్ని శబ్దాలు, యాక్టివిటీస్, వాసనలు వంటివి మనకు తెలియవు. అదే ప్రమాదకర సంఘటనో, భయంకర శబ్దాలో వినిపిస్తే మాత్రం మన మెదడు వెంటనే అలర్ట్ అయి నిద్రలోంచి మేల్కొనేలా ప్రేరేపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే బయటి సమచారాన్ని గ్రహించి, దానిని ఫిల్టర్ చేసి మనం ఎలా స్పందించాలో నిర్ణయిస్తుచేది మన మెదడు మాత్రమే. అందుకే వార్నింగ్ సిగ్నల్స్ వంటివి వినపడినప్పుడు మనం ఆటోమేటిక్‌గా మేల్కొంటాం. ఎందుకంటే బ్రెయిన్ మనల్ని నిద్రలేచేలా ఒత్తిడి చేస్తుంది.

Read More..

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ వాస్తుచిట్కాలు పాటించి చూడండి!

Advertisement

Next Story

Most Viewed