Viral : నీలి రంగు చీరలో.. జపాన్ వీధుల్లో.. ఆ యువతి చేసిన పనికి అందరూ షాక్!.. (వీడియో)

by Javid Pasha |   ( Updated:2024-05-17 14:01:47.0  )
Viral : నీలి రంగు చీరలో.. జపాన్ వీధుల్లో.. ఆ యువతి చేసిన పనికి అందరూ షాక్!.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : ‘నీలి రంగు చీరలో నా.. చందమామ నీవే జాణ’ అనే సినీ గేయం గుర్తుందా?.. ‘గోవిందుడు అందరివాడే లే’ సినిమాలోని ఈ పాటు ఎంతమంది హృదయాలను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడెందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే.. రీసెంట్‌గా జపాన్ వీధుల్లో.. అందమైన చీరకట్టులో తిరుగుతున్న ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తే ఎవరికైనా ఠక్కున ఆ ‘నీలి రంగు చీర’ పాట గుర్తుకు వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. వస్త్రధారణ విషయంలోనూ అది కనిపిస్తుంది. ఒక్కో దేశంలోని ప్రజలు ఒక్కో రకమైన దుస్తులను ధరిస్తుంటారు. ఎవరి స్టైల్ వారికి నచ్చడంతోపాటు ఇతరుల వస్త్ర ధారణ కూడా ప్రజలను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అదే జరిగింది. దశాబ్దాల క్రితం జపాన్‌లో సెటిల్ అయిన భారతీయ కుటుంబానికి చెందిన ఓ యువతి ఇన్‌స్టా‌లో ఫాలోవర్స్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుందట. దీంతో వెంటనే ఆమెకు ఇండియన్ వస్త్రధారణలో భాగమైన ‘చీరకట్టు’ గుర్తుకొచ్చిందట.

ఇంకేముందు గోల్డ్ కలర్ బార్డర్ కలిగిన ఓ నీలిరంగు చీర ధరించిన యువతి జపాన్ వీధుల్లో తళుక్కున మెరిసింది. డిఫరెంట్ స్టైల్‌లో ఫొటో షూట్‌కు ఫోజులు ఇవ్వడమే కాకుండా, క్యాట్ వాక్‌తో హొయలొలుకుతూ యువతను ఆకట్టుకుంది. జపాన్‌లో ఎవరూ చీర కట్టుకోరు కాబట్టి ఈ వస్త్రధారణ అక్కడి వారికి కొత్తగా అనిపించడంతోపాటు అక్కడి జనాలు ఈ యువతిని ఎగబడి చూడటం ప్రారంభించారు. పలువురు యువతీ యుకులు ఫొటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకుకొని మురిసిపోయారు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ఆ ‘నీలి రంగు చీర సాంగ్’ గుర్తుకు వచ్చిందంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read More..

హాస్పిటల్, క్లినిక్ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా..


Advertisement

Next Story

Most Viewed