Kantola : 90 రోజులు మాత్రమే లభించే కూరగాయ.. అందులో అనేక ఔషధగుణాలు..

by Sumithra |
Kantola : 90 రోజులు మాత్రమే లభించే కూరగాయ.. అందులో అనేక ఔషధగుణాలు..
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో లభించే బోడకాకర కాయ (కంటోలా) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఏడాదిలో రెండు మూడు నెలలు మాత్రమే లభించే ఈ సీజనల్ వెజిటేబుల్ ఔషధ గుణాల కారణంగా ప్రాచుర్యం పొందుతోంది. బోడ కాకరకాయ గుండ్రండా బరుకుగా ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఆయుష్ మెడికల్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం బోడకాకరకాయ తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు అనేక రకాల పోషకాలు, ఖనిజాలు ఇందులో ఉన్నాయి. ఇవి శరీర పోషణ, అభివృద్ధికి సహాయపడతాయి. ఈ కూరగాయ ముఖ్యంగా మధుమేహం, రక్తపోటుతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

డయాబెటిస్‌కు మంచి మందు..

బోడకాకరకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే ఇది వర్షాకాలంలో సులువుగా దొరుకుతుంది. కాబట్టి దాని ఔషధ గుణాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి దీనిని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలు శరీరానికి పోషకాలు ఇవ్వడమే కాకుండా తీవ్రమైన వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story