సబ్జా గింజల్లో అద్భుత పోషకాలు.. ఇలా తీసుకుంటే ఆ సమస్యలన్నీ దూరం!

by Javid Pasha |
సబ్జా గింజల్లో అద్భుత పోషకాలు.. ఇలా తీసుకుంటే ఆ సమస్యలన్నీ దూరం!
X

దిశ, ఫీచర్స్ : సబ్జా గింజల గురించి అందరికీ తెలిసిందే. నీటిలో నానబెట్టి పరగడుపున ఆ నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా వేసవిలో తాగడంవల్ల శరీరంలో వేడి తగ్గుతుందని, మూత్రంలో మంట, జీర్ణ సంబంధిత సమ్యలు దూరం అవుతాయని నిపుణులు చెప్తుంటారు. అయితే వాటివల్ల ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* సబ్జా గింజలను ఒక గ్లాస్ వాటర్‌లో మినమమ్ అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా అప్పుడప్పుడూ చేస్తుంటే శరీరంలో వేడి తగ్గడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తలలో చుండ్రు, జుట్టు రాలే సమస్యలు, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

* ఫైబర్ కంటెంట్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కాబట్టి సబ్జా గింజలను నానబెట్టిన తర్వాత తీసుకుంటే చాలా మంచిది. అజీర్తి, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు తగ్గడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి.

Advertisement

Next Story

Most Viewed