- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20ఏళ్ల తర్వాత పేరెంట్స్‌పై ఆధారపడకూడదు.. రైటా?.. రాంగా?
దిశ, ఫీచర్స్ : కాలానుగుణంగా లైఫ్ కంఫర్టబుల్ కోసం కొన్ని మార్పులను తప్పక స్వాగతించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెప్తుంటారు. అయితే మార్పు మంచిదని భావించినప్పుడు మాత్రమే ప్రజలు వాటిని కోరుకుంటారు. తమకు ఇబ్బందికరమైందిగా అనిపిస్తే అది ఎంత గొప్ప మార్పు అని ప్రచారం చేసినా అంగీకరించేందుకు ఇష్టపడరు. ఈ క్రమంలోనే వెస్టర్న్ కంట్రీస్ మాదిరిగా 20 ఏళ్లు పైబడినవారు తమ పేరెంట్స్‌పై ఆధారపడకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి స్వతంత్రంగా బతకాలనే కాన్సెప్ట్ మంచిదా? కాదా? అనే డిస్కషన్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. శుభ్ అనే పేరు గల ఒక ట్విట్టర్ యూజర్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో (microblogging platform ) ఈ ప్రశ్నను లేవనెత్తాడు. స్వతంత్రంగా బతకాలంటే 20 ఏళ్ల వయస్సులోనే పిల్లలు తమ పేరెంట్స్‌పై ఆధారపడకుండా బయటకు వెళ్లాలనే అభిప్రాయాన్ని ఎంత మంది అంగీకరిస్తారు? అని అతను ప్రశ్నించాడు. అతను మే 8న షేర్ చేసిన ఈ పోస్టుకు ఒక లక్ష 22 వేల వ్యూస్ రాగా, 2 వేల లైకులు వచ్చాయి. లక్షల కొద్దీ రిప్లయ్స్ వస్తున్నాయి.
పాశ్చాత్య దేశాల్లో అది సర్వసాధారణం కావచ్చు కానీ ఇండియాలో మాత్రం ఇంపాసిబుల్ అంటున్నారు పలువురు యూజర్లు. అదర్ సిటీస్‌లోనో, విదేశాల్లోనో చదువుకోసం వెళ్లాల్సి వస్తే తప్ప 20 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి బయటకు వెళ్లి స్వతంత్రంగా బతకడం ఇక్కడ సాధ్యం కాదని, దానిని పేరెంట్స్‌తోపాటు పిల్లలు కూడా ఇష్టపడరని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణ భారతీయ కుటుంబాల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లడం తప్పనిసరి అనే రూల్ ఏమీ లేదని కొందరు పేర్కొంటున్నారు. పిల్లలను కంఫర్ట్ జోన్‌లో పెంచి, తమంతట తాముగా ప్రపంచాన్ని అన్వేషించడానికి అనుమతించకపోతే, వారు తమ మనుగడ నైపుణ్యాలను ఎలా డెవలప్ చేసుకుంటారని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు పేరెంట్స్‌కు దూరంగా జీవిస్తున్నారని, కానీ అలా జీవించడం అంత సులభం కాదని, ఇది గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అని కామెంట్ చేస్తున్నారు.
అవసరమే కానీ, తప్పనిసరి కాదు
“మీ 20 ఏళ్లలో మీ తల్లిదండ్రుల ఇంటి నుంచి బయటకు వెళ్తే, రోజువారీ జీవితంలో మీకు మీరు సొంతంగా ఎలా నావిగేట్ చేయాలో తెలుసుకోవడానికి దోహదపడుతుంది. జీవితం గురించి నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంతేగాక జీవితం, డబ్బు విలువను అర్థం చేసుకోవడం, ఇంటి పనులను నేర్చుకోవడం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడం, వ్యక్తుల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడం వంటివి తెలిసొస్తాయి’’ అంటున్నారు 29 ఏళ్ల నివేదిత శ్రీనివాస్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సందర్భంగా మీరు తప్పు చేస్తే దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటారని, అది జీవితపాఠంగా మారుతుందని, మీరు రిస్క్ తీసుకొని ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకునప్పుడు అది మీ స్వంత విజయం అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఇది వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుందని చెప్తున్నారు. అదే సందర్భంలో పేరెంట్స్ ఇంటి నుంచి బయటకు వెళ్లడం అనేది తప్పనిసరి పరిస్థితి కాకూడదని.. తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ ఈ నిర్ణయంతో సౌకర్యవంతంగా ఉంటేనే అది ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయడింది నివేదిత.
దూరంగా ఉండి చూడండి
“అవును, పిల్లలు తమ 20 ఏళ్లలో పేరెంట్స్‌పై ఆధారపడకుండా బయటకు వెళ్లడం మంచిదని నేను నమ్ముతున్నాను. అది వ్యక్తులుగా మనం ఎదగడానికి, మన సొంత తప్పులు చేయడానికి, సరిదిద్దుకోవడానికి, జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు మనకు చాలా నేర్పించినప్పటికీ లేదా మనకు అవసరమైన స్పేస్ ఇచ్చినప్పటికీ, కొన్నిసార్లు మనం ప్రయోజకులుగా ఉండకపోవచ్చు. ఇది పేరెంట్స్‌కు కూడా ఇబ్బందికరమే. మనం స్వంతంగా ఉన్నప్పుడు నిజమైన జీవితసత్యాన్ని అర్థం చేసుకుంటాం. ఆర్థిక స్థోమత లేనివారు తమ జీవితాన్ని తాము ప్లాన్ చేసుకోవడానికి కనీసం కొన్ని నెలలు హాస్టల్‌లో లేదా ఇంటికి దూరంగా ఉన్న నగరంలో ఉండాలని నేను సూచిస్తున్నాను” అని 29 ఏళ్ల దీప్తి శ్రీధర్ వెల్లడించాడు.
జీవితపాఠం నేర్చుకుంటారు
28 ఏళ్ల సబ్నా మాట్లాడుతూ.. పిల్లలు తమ తల్లిదండ్రుల ఇంటి నుంచి 20 ఏళ్ల ప్రారంభంలో లేదా మధ్యలో బయటకు వెళ్లడం వల్ల జీవితం అంటే ఏమిటో, తల్లిదండ్రుల జోక్యం లేదా సపోర్టు లేకుండా ఎలా జీవించాలో తెలుసుకోగలుగుతారని పేర్కొన్నారు. పిల్లలు స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, స్పష్టంగా ఆలోచించడానికి ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటప్పుడు కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కానీ మీరు వేరొకరిపై నిందలు వేయకుండా వాటి నుంచి జీవితపాఠం నేర్చుకోవాలని సబ్నా సూచించారు.
బాధ్యతగా ఉంటుందేమో
తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న 29 ఏళ్ల శృతి మాట్లాడుతూ.. “నేను బయటికి వెళ్లడానికి మా పేరెంట్స్ ఎప్పుడూ అనుమతించలేదు కాబట్టి, నాకు అస్సలు బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు. పైగా అద్దె లేదు, కిరాణా బిల్లులు లేవు, విద్యుత్ బిల్లులు లేవు, ఇవన్నీ నా తల్లిదండ్రులే చూసుకుంటారు. నేను ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని, ఇల్లు వదిలి వెళ్లిపోతానని, సంపాదన ఎందుకని నా పేరెంట్స్ భావించారు. కానీ పెళ్లయ్యాక నేను బయటకు వెళ్లకుండా ప్రాథమిక ఖర్చుల కోసం కూడా నా భాగస్వామిపై ఆధారపడవలసి వస్తుందని భయపడుతున్నాను. నన్ను కూడా బయటకు వెళ్లడానికి పేరెంట్స్ అవకాశం ఇచ్చి ఉంటే.. నేనిప్పుడు ఉన్న పరిస్థితికంటే భిన్నంగా, బాధ్యతగా ఉండే దాన్ని కదా అనిపిస్తోంది’’ అంటూ చెప్పుకొచ్చింది శృతి.
పరిస్థితిని నిర్ణయం
పేరెంట్స్‌పై ఆధారపడకుండా బయటకు వెళ్లడం మంచిది కావచ్చు. కానీ అందరి విషయలో కాదని 29 ఏళ్ల అన్నే జాకబ్ పేర్కొన్నది. ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉండటానికే మొగ్గు చూపింది. పేరెంట్స్‌కు దూరంగా ఇల్లు వదిలి వెళ్లడం, వారితో కలిసి ఉండటం రెండూ మంచి ఎంపికలేనని ఆమె అభిప్రాయపడింది. అయితే అది పూర్తిగా వ్యక్తిగతమైన ఎంపికగా పరిగణించాలని పేర్కొన్నది. అది తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులు మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. “నా విషయానికొస్తే, నా తల్లిదండ్రులిద్దరూ వృద్ధులు, నేను బయటకు వెళ్లడానికి చాలా అవకాశాలు ఉన్నప్పటికీ, ఒకే సంతానం కావడంతో వారిని వదిలిపెట్టి వెళ్లలేను. వారి ఆరోగ్యం, అనేక ఇతర అంశాలు వారు నాపై, నేను వారిపై ఆధారపడేలా చేశాయి. కాబట్టి, నేను వ్యక్తిగతంగా వారి కోసం ఎల్లప్పుడూ ఉండటమే ఉత్తమ నిర్ణయం” అని జాకబ్ అభిప్రాయపడింది. మొత్తానికి 20 ఏళ్ల వయస్సు రాగానే పిల్లలు తమ పేరెంట్స్‌పై ఆధారపడకుండా బయటకు వెళ్లి స్వతంత్రంగా బతకాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవతున్నాయి తప్ప ఏకాభిప్రాయానికి అవకాశం లేదు.
ఇవి కూడా చదవండి: