రోజూ 5 నిమిషాలు ఈ పనిచేస్తే చాలు.. ఆ సామర్థ్యం పెరగడమే కాకుండా..

by Javid Pasha |
రోజూ 5 నిమిషాలు ఈ పనిచేస్తే చాలు.. ఆ సామర్థ్యం పెరగడమే కాకుండా..
X

దిశ, ఫీచర్స్ : ప్రతిరోజు కనీసం అరగంట మెడిటేషన్ చేయడంవల్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్తుంటారు. కానీ తాజా అధ్యయనం మాత్రం డీప్ అండ్ మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ 5 నిమిషాలు చేసినా ఆ ఫలితం దక్కుతుందని వెల్లడించింది. పైగా లోతైన ధ్యానం కారణంగా కాగ్నెటివ్ స్కిల్స్, లెర్నింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయని పేర్కొన్నది. అదే సందర్భంలో కొత్త అంశాలను గ్రహించడానికి, సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి ఇది సహాయపడుతుందని స్పష్టం చేసింది.

మైండ్ ఫుల్‌నెస్ మెడిటేషన్ భావోద్వేగాలు, ఒత్తిడి నియంత్రణ వంటివి మేనేజ్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు గతంలో గుర్తించారు. అయితే ఇప్పుడు కేవలం అతి తక్కువ వ్యవధిలో ఎటువంటి ఫలితాలను ఇస్తుందో తెలసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్‌కు చెందిన పరిశోధకులు తక్కువగా మెడిటేషన్‌లో పాల్గొనేవారిని, అలాగే ఎటువంటి మెడిటేషన్ అనుభవం లేని వారిని మొత్తం 60 మంది చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ఈ పార్టిసిపెంట్స్‌లో హైస్కూల్ మొదలుకొని పీహెచ్‌డీ డిగ్రీల వరకు వివిధ ఎడ్యుకేషన్ నేపథ్యాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో ఒక గ్రూపు వారిని 5 నిమిషాల మైండ్ ఫుల్‌నెస్ ధ్యానం చేయడాన్ని, మరొక గ్రూపును సాధారణ ధ్యానంలో నిమగ్నమయ్యేలా సూచించించారు. కాగా మైండ్ ఫుల్‌నెస్ (బుద్ధిపూర్వక)శ్వాసపై దృష్టి సారించిన 5 నిమిషాల లోతైన ధ్యానం చేసేవారిలో కొంతకాలానికి కాగ్నెటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవడం, నేర్చుకునే సామర్థ్యం, పలు నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి పెరగడం గ్రహించారు. ఐదు నిమిషాల డీపెస్ట్ మెడిటేషన్ ఇందుకు దోహదపడిందని నిర్ధారించారు.

Advertisement

Next Story

Most Viewed