- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీ మళ్లీ వేడి చేసి తాగితే అనారోగ్య ప్రమాదాలు.. బ్యాక్టీరియా, ఫంగస్ చేరడంతో
దిశ, ఫీచర్స్: భారతదేశంలో అత్యంత ఇష్టమైన హాట్ బెవరేజేస్ లో టీ ఒకటి. దాదాపు ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ప్రతిరోజూ కనీసం రెండు సార్లు టీ తాగుతారు. అయితే ఒకసారి చేసుకున్న టీని మళ్లీ వేడి చేసి తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ నాలుగు గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన తర్వాత టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
* మిగిలిపోయిన టీలో ఫంగస్, బ్యాక్టీరియా వంటి జెర్మ్స్ వృద్ధి చెందుతాయి. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది.
* మిల్క్ టీ మళ్లీ 41 నుంచి 140 డిగ్రీల ఫారెన్‌హీట్ మధ్య వేగంగా హీట్ చేయబడుతుంది. దీని ద్వారా బ్యాక్టీరియా తొలగించబడక పోవడమే కాదు అసహ్యకరమైన రుచిని కలిగిస్తుంది.
* హెర్బల్ టీని మళ్లీ వేడి చేసినప్పుడు దానిలోని పోషకాలు, ఖనిజాలను కోల్పోతుంది. ముఖ్యమైన నూనెలు, ప్రయోజనకరమైన సమ్మేళనాలు నాశనమవుతాయి.
* టీని ఎక్కువసేపు నిల్వ ఉంచడం వల్ల టానిన్ అధికంగా విడుదల అవుతుంది. ఇది చేదు రుచిని కలిగిస్తుంది. కడుపు నొప్పి, అతిసారం, తిమ్మిర్లు, ఉబ్బరం, వికారం, ఇతర జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు.