Nature : ప్రకృతికి విరుద్ధంగా జరిగే సంఘటనల్లో ఇది కూడా ఒకటి!

by Prasanna |
Nature : ప్రకృతికి విరుద్ధంగా జరిగే సంఘటనల్లో ఇది కూడా ఒకటి!
X

దిశ,వెబ్ డెస్క్ : మన భూమి పై జరిగే కొన్ని వైపరీత్యాలు మనం చూసే ఉంటాము. మనమే కాదు మన పూర్వీకులు కూడా అవి సుపరిచితాలే. వినడమే కానీ చూసి ఉండని సంఘటనలు చాలానే ఉంటాయి. వాటిని ఒక్కోసారి కొట్టి పారేస్తాం.. లేదా ఎవరో ఏలియన్స్ అలా చేసారని నమ్ముతాము. వాటిని చదివితే ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోవాలిసిందే.అలాంటి వాటిలో ఒక దాని గురించి ఇక్కడ చెప్పుకుందాం.

వడ గళ్ళ వాన

వడ గళ్ళ వానంటే మనలో చాలా మందికి ఇష్టం. అప్పుడప్పుడు వచ్చే ఈ వానలో తడుస్తుంటారు. వడ గళ్ళను పట్టుకొని చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. 8 ఫిబ్రవరి 2018 న అర్జెంటీనాలో వడ గళ్ళ వాన ముందు చిన్న చిన్న వడ గళ్ళ తో ప్రారంభమయ్యింది. అక్కడ ఉన్న వాళ్లు దాన్ని చూసి కొంత సేపు ఆడుకున్నారు.. కానీ సమయం గడిచే కొద్దీ వడ గళ్ళు టెన్నిస్ బాల్ సైజులో విపరీతమైన గాలితో పాటు కింద పడ్డాయి. అలా చాలా సేపు వడ గళ్ళ వాన తన రౌద్ర రూపం ప్రజలకు చూపించింది. ప్రపంచంలో ఇంత వరకు ఎక్కడా అలా జరగలేదు. అలా కొని గంటల పాటు అదే విధంగా రాళ్లు పడుతూనే ఉన్నాయి.ఇది చూసిన అక్కడి జనాలు భయ పడిపోయారు. ప్రకృతి చాలా విచిత్రమైనది.. శక్తివంతమైనది కూడా.ఎప్పుడూ ఎలా ఉంటుందో ఎవరి ఊహకు అందదు.

Advertisement

Next Story