Mulberry fruits: ఏడాదిలో మూడు నెలలు మాత్రమే దొరుకుతాయ్.. ఇవి తింటే డాక్టర్ అవసరం లేదిక!

by Javid Pasha |
Mulberry fruits: ఏడాదిలో మూడు నెలలు మాత్రమే దొరుకుతాయ్.. ఇవి తింటే డాక్టర్ అవసరం లేదిక!
X

దిశ, ఫీచర్స్ : ఆయా సీజన్ల వారీగా లభించే పండ్లు తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. వీటిలో అనేక పోషకాలు ఉండటంవల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదీగాక కొన్ని ఏడాది మొత్తంలో కొద్దిరోజులే అందుబాటులో ఉంటాయి. మిస్ అయితే మళ్లీ సీజన్ వచ్చే వరకు ఆగాలి. అలాంటి వాటిలో మల్బరీ పండ్లు ఒకటి. ఈ చెట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

మల్బరీ పండ్లల్లో సైనైడింగ్, గ్లూకోసైడ్ వంటి మూలకాలు ఉండటంవల్ల రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. యాపిల్ దానిమ్మ, అరటి పండ్లకంటే కూడా మల్బరీ పండ్లు మంచిదని, వీటిని తింటే ఇక ఒక డాక్టర్ అవసరం లేదని కూడా అంటుంటారు. ఎందుకంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంవల్ల పలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. కాకపోతే ఎప్పుడూ లభించవు. మే నుంచి సెప్టెంబర్ మధ్య మాత్రమే ఈ మల్బరీ పండ్లు అందుబాటులో ఉంటాయట. ఐరన్, పొటాషియం, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫాస్పరస్ వంటి పోషకాలు వీటిలో ఫుల్లుగా ఉంటాయి. రెడ్ బెర్రీ, బ్లాక్ బెర్రీ అని కూడా పిలుస్తుంటారు. ఇవన్నీ శరీరానికి బలాన్నిస్తాయి.

మల్బరీ పండ్లల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని జియాక్సంతిన్ అనే సమ్మేళనం కంటి కణాలలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. కెరోటినాయిడ్స్ క్యాటరాక్ట్, మాక్యులర్ డీహైడ్రేషన్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి. క్యాల్షియం మూలంగా ఎముకలు బలంగా తయారవుతాయి. పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహించే పోషకాలు కలిగి ఉండటంవల్ల మల్బరీ పండ్లను తప్పక తినాలని పెద్దలు, నిపుణులు సూచిస్తారు.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే పోషకాహార నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story