- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ పిల్లలు నిద్రలో నోటితో శ్వాస తీసుకుంటున్నారా? రిస్క్‌లో పడినట్లే
దిశ, ఫీచర్స్: నిద్రపోయేటప్పుడు చాలా మంది ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకోవడం గమనిస్తుంటాం. అయితే ఈ మౌత్ బ్రీతింగ్ అనేది చాలా హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బీపీ, డయాబెటిస్, వెయిట్ లాస్, మెమొరీ లాస్ వంటి అనారోగ్యాలకు దారితీస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయి. అలెర్జీ, జలుబు, సైనసైటిస్ కారణంగా ముక్కు బ్లాక్ అయిపోయి శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు నోటితోనే గాలి పీల్చుకోక తప్పదు. అయితే మనకు తెలియకుండానే జరిగే ఈ ప్రక్రియ.. పిల్లల్లో అనేక రుగ్మతలకు దారితీస్తుందని, దీన్ని అవాయిడ్ చేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ప్రమాదాలు :
1. నోటి ద్వారా శ్వాస తీసుకునే పిల్లల ఫేస్‌లో అబ్‌నార్మాలిటీస్, వంకర దంతాలు ఉండటంతోపాటు డెవలప్మెంట్ డిజార్డర్స్ వెంటాడే అవకాశం ఉంది.
2. నోటి బ్యాక్టీరియా పెరిగిపోయి చెడు శ్వాస, దంత క్షయం, రక్తహీనతకు దారితీస్తుంది.
3.ఎక్కువ సేపు నిద్రలో నోటి ద్వారా శ్వాస తీసుకోవడం అడెనాయిడ్ లేదా టాన్సిలర్ విస్తరణకు కారణమవుతుంది. దీనివల్ల నాసికా గాలి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. నోరు, గొంతు పొడిబారడానికి దారితీస్తుంది.
4. నిద్ర నాణ్యత తగ్గిపోవడం, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.
అవాయిడింగ్ టిప్స్ :
1. పెదవులను కలిపి ఉంచడం ద్వారా ముక్కుతో శ్వాస తీసుకునే శిక్షణ ఇవ్వండి.
2. ఒరోఫారింజియల్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా నాలుకను బలోపేతం చేయవచ్చు. ఇది మీ వాయుమార్గాన్ని తెరిచి ఉంచడానికి సహాయపడుతుంది.
3. సెలైన్ స్ప్రేలు ఉపయోగించి నాసికా మార్గాలను క్లియర్ చేయడం వల్ల ముక్కు బ్లాక్ కాకుండా ఉంటుంది. నాసికా శ్వాసను ప్రోత్సహిస్తుంది.
4. సైడ్‌కు పడుకోవడం ద్వారా మౌత్ బ్రీతింగ్ కంట్రోల్ చేయొచ్చు.