Mirror technique : మిర్రర్ టెక్నిక్.. పిల్లల్లో చదువుపై శ్రద్ధ, ఏకాగ్రతను పెంచండిలా..

by Javid Pasha |
Mirror technique : మిర్రర్ టెక్నిక్.. పిల్లల్లో చదువుపై శ్రద్ధ, ఏకాగ్రతను పెంచండిలా..
X

దిశ, ఫీచర్స్ : తమ పిల్లలు బాగా చదువుకోవాలని, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని పేరెంట్స్ అనుకోవడం సహజమే. కానీ పిల్లలు మాత్రం కొన్నిసార్లు ఇవి అస్సలు పట్టించుకోరు. చూడ్డానికి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించినా చదువుపై శ్రద్ధ పెట్టరు. ఏకాగ్రత కనబర్చరు. దీంతో వెనుకబడుతుంటారు. ఈ సమస్యను అధిగమించాలంటే ‘మిర్రర్ టెక్నిక్’ అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. పిల్లలు అద్దం ముందు కూర్చొని చదవడం ద్వారా వచ్చే సానుకూల మార్పే ఇది.

*సెల్ఫ్ మోటివేషన్ : పిల్లలు పుస్తకాలు చేతబట్టగానే సహజంగానే నిద్రపోతుంటారు. ఈ పరిస్థితిని డైవర్ట్ చేయడానికి వారిని గదిలో పొడవైన అద్దం ముందు కూర్చొని చదువుకునేలా చూడాలంటున్నారు నిపుణులు. చదవడం అయిపోయేంత వరకు నిద్రపోకుండా ఉండేందుకు ఈ టెక్నిక్ సాయపడుతుంది. ఎందుకంటే తమను తాము అద్దంలో చూసుకుంటూ చదవడం ద్వారా పిల్లలు స్వీయ ప్రేరణ పొందుతారని, దానిని అనుభూతి చెందుతారని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది.

*ఆత్మ విశ్వాసం : ప్రస్తుతం చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అభిప్రాయాలు వ్యక్త పరచడంలో, అవసరమైనప్పుడు సమస్యలను ఎదుర్కోవడంలో ఇది చాలా ముఖ్యం. నేర్చుకున్నది స్పష్టంగా పలకడం, ఏమాత్రం భయపడకుండా చెప్పగలగడం వంటి నైపుణ్యాలు పిల్లల్లో అలవడాలంటే వారిలో ఆత్మ విశ్వాసం కూడా కావాలి. అద్దం ముందు కూర్చొని లేదా నిలబడి చదవడం, మాట్లాడటం, నేర్చుకోవడం వంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇవన్నీ ఏర్పడతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే అద్దంలో చూస్తున్నంత సేపు పిల్లలు స్వీయ ప్రేరణ పొందుతారు.

Advertisement

Next Story

Most Viewed