సమ్మర్‌లో మైగ్రేన్ ఎందుకు తీవ్రమవుతుందో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-05-18 07:27:49.0  )
సమ్మర్‌లో మైగ్రేన్ ఎందుకు తీవ్రమవుతుందో  తెలుసా?
X

దిశ, ఫీచర్స్: తల భాగంలో ఒకవైపు మాత్రమే తీవ్రమైన నొప్పిని మైగ్రేన్‌గా పేర్కొంటారు. అయితే ఈ సమస్య వేసవిలో చాలామందికి అధికం అవుతూ ఉంటుంది. అసలు ఎన్నడూ మైగ్రేన్ ప్రాబ్లం లేని వారికి కూడా సమ్మర్‌లో అప్పుడప్పుడూ ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. అందుకు కారణం వేడి ప్రభావమే అంటున్నారు వైద్య నిపుణులు. ఒక్కశాతం డీ హైడ్రేషన్‌కు గురైనా తలనొప్పి లేదా మైగ్రేన్ రావచ్చు. దీంతోపాటు శరీరంలో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ డి లోపాలు కూడా మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. అందుకే సమ్మర్‌లో తరచుగా హైడ్రేట్‌గా ఉండేందుకు నీళ్లు అధికంగా తాగాలని, నీటిలో ఎలక్ట్రోలైట్స్, రాక్‌సాల్ట్, నిమ్మకాయను జోడిస్తే ఇంకా త్వరగా ఉపశమనం లభిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.

డీహైడ్రేషన్, మైగ్రేన్‌కు మధ్య లింక్

డీ హైడ్రేషన్ అనేది మైగ్రేన్‌కు కారణమవుతుంది. ఇది మెదడుకు రక్త సరఫరాను తగ్గించడంవల్ల తలనొప్పి, మైగ్రేన్లు వస్తాయని డాక్టర్ ఓక్ వెల్లడించారు. దీంతోపాటు ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, నిద్రలేమి, కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు, కెఫిన్ అధికంగా తీసుకోవడంచ వాతావరణంలో మార్పులు, కాంతి, ధ్వని కాలుష్యాలు, స్మెల్ అలర్జీలు కూడా మైగ్రేన్‌కు దోహదం చేస్తాయి.

తగ్గించే మార్గాలు

సమస్య తలెత్తడానికి కారణం అయ్యే నిర్దిష్ట ఆహారం లేదా పానీయాలను గుర్తించి అవైడ్ చేయాలి. స్థిరమైన నిద్ర విషయంలో షెడ్యూల్‌ను ఫాలో కావాలి. ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడి నివారణ పద్ధతులను పాటించాలి. తరచూ హైడ్రేటెడ్‌గా ఉండడం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడం, కెఫీన్ తీసుకోవడాన్ని క్రమంగా తగ్గించడం చేయాలి.

జీవనశైలిలో మార్పులు

బ్లడ్ సర్క్యులేషన్‌ను ప్రోత్సహించడానికి, స్ట్రెస్‌ను తగ్గించడానికి రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. మెగ్నీషియం, రిబోఫ్లావిన్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. డీ హైడ్రేషన్ రిలేటెడ్ మైగ్రేన్లను నివారించడానికి సరైన హైడ్రేషన్ మెయింటెన్ చేయాలి. స్ట్రెస్, యాంగ్జైటీ రిలాక్సేషన్ టెక్నిక్‌లను ప్రాక్టీస్ చేయాలి. నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించకోవాలి. స్థిరమైన నిద్ర షెడ్యూల్‌ను మెయింటెన్ చేయాలి.

ట్రీట్‌మెంట్

మైగ్రేన్‌కు నివారణ పద్ధతులతోపాటు ట్రీట్‌మెంట్ కూడా అందుబాటులో ఉంది. ముందుగా తలనొప్పి డైరీని నిర్వహించడం అవసరం. అంటే.. నొప్పి ఎప్పుడు ఎందుకు వస్తోందనే సమాచారం తెలిసి ఉండాలని న్యూరాలజిస్టులు అంటున్నారు. రోగికి ఎప్పుడు తలనొప్పి వచ్చింది. అది ఎంతకాలం కొనసాగింది. నొప్పి యొక్క తీవ్రత, ఉపశమనం కలిగాక ప్రభావాలను అంచనా వేయడానికి ఇది తోడ్పడుతుంది. ఇక ట్రీట్మెంట్‌లో పలు రకాలు ఉన్నాయి. మైగ్రేన్ ప్రారంభం అయ్యాక తగ్గించే విధానాన్ని అబార్టివ్ ట్రీట్‌మెంట్ అంటారు. అలాగే మైగ్రేన్ వచ్చే సూచనలు ఉన్నప్పుడు వైద్యులు మందులను సూచించడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించడాన్ని ప్రివెంటివ్ అండ్ ప్రొఫిలాక్టిక్ థెరపీ అంటారు. ఇది భవిష్యత్తులో తొలనొప్పి ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక మరో విధానం రోగులు మైగ్రేన్ లక్షణాలను గుర్తించినప్పుడు కూడా చికిత్సతోపాటు, నొప్పికి కారణమయ్యే పరిస్థితులను, ఆహారాలను నివారించడం వంటి వివిధ పద్ధతుల ద్వారా ఉపశమనం పొందవచ్చు. దీనిని ఫార్మకోలాజికల్ అండ్ నాన్ ఫార్మకోలాజికల్ చికిత్స అంటారు.

ఇవి కూడా చదవండి: సమ్మర్‌లో ఆస్తమా పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Advertisement

Next Story