- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వర్షాలతో వైరల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు.. నివారణకోసం ఇలా చేయండి
దిశ, ఫీచర్స్ : రెండు మూడు రోజులుగా వర్షాలు ఫుల్లుగా కురుస్తున్నాయి. డ్రయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు రోడ్లపై పారుతోంది. మురుగునీటి ప్రవాహాంతో చెత్తా చెదారం పేరుకుపోతోంది. వాటిలోని రోగకారక సూక్ష్మజీవులు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో బాక్టీరియల్, వైరల్ ఇన్ ఫెక్షన్లు వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సాధారణంగా వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తీవ్రమైన జలుబు, గొంతు నొప్పితో ప్రారంభం అవుతాయి. ముక్కు కారటం, ఫీవర్, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించగానే నివారణ చర్యలు తీసుకోవడం, డాక్టర్లను సంప్రదించడం మంచిది.
నివారణ చర్యలు
వైరల్, బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ల సింప్టమ్స్ కనబడగానే యాంటీ బయాటిక్స్ వాడటం, సొంతంగా మందులు వాడటం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అస్వస్థతకు గురైన తర్వాత మీ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ, రోగకారకాలతో పోరాడుతుంది. దీంతో సహజంగానే తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ తగ్గకపోతే వైద్యుల సలహాతో మెడిసిన్ వాడాలి. ఇంటివద్ద తీసుకోవాల్సిన నివారణ చర్యలను పాటించాలి. ఉదాహరణకు గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పువేసుకొని తాగాలి. అలాగే ఒక గిన్నెలో వేడి నీరు తీసుకుని రెండు మూడు డ్రాప్‌ల యూకలిప్టస్ ఆయిల్ వేసి కొద్దిసేపు ఆవిరి పట్టవచ్చు. అలాగే వేడినీటిలో చిటికెడు పసుపు వేసి కూడా ఆవిరి పట్టవచ్చు. జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవడానికి త్వరగా జీర్ణమయ్యే తేలికైన ఆహారం, పానీయాలు తీసుకోవాలి. బయటి ఆహారాలు తీసుకోవద్దు. ఇంట్లో తయారుచేసిన వేడివేడి సూప్స్, గ్రీన్ టీలు, పసుపు-మిరియాలు కలిపిన గోరు వెచ్చని పాలు, ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటన్నింటితోపాటు తగినంత రెస్టు అవసరం. ఈ ప్రయత్నాలతో ఉపశమనం కలుగకపోతే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
Read More: శాకాహారం పర్యావరణ నష్టాన్ని భారీగా తగ్గిస్తుంది.. అధ్యయనంలో వెల్లడి