పెళ్లి చేసుకోవాలా వద్దా అనే డైలమోలో ఉన్నారా? ఇది చదవితే క్లారిటీ వస్తుంది..

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-13 14:16:14.0  )
పెళ్లి చేసుకోవాలా వద్దా అనే డైలమోలో ఉన్నారా? ఇది చదవితే క్లారిటీ వస్తుంది..
X

దిశ, ఫీచర్స్: మీరు త్వరలో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? కానీ మనసులో చాలా సందేహాలు తలెత్తుతున్నాయా? కాబోయే భాగస్వామితో ఫ్యూచర్ ఎలా ఉంటుందనే భయం వెంటాడుతుందా? అయితే ఇలాంటి డైలామోలో మీరు ఒక్కరు మాత్రమే కాదు చాలా మంది ఉన్నారు. లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్ మ్యారేజ్ ఏదైనా సరే.. వివాహం వల్ల కలిగే అడ్వాంటేజెస్, డిస్‌అడ్వాంటేజెస్ ఇదిగో మీకోసం. పెళ్లి ఎందుకు బెస్ట్ లేదా వరెస్ట్ అనేది ఈ కారణాలను పరిశీలించి తెలుసుకోండి.

ADVANTAGES

* బెస్ట్ ఫ్రెండ్స్ : మీతో బోరింగ్ రియాలిటీ షోస్ చూస్తారు. మీ టెర్రిబుల్ జోక్స్‌కు పగలబడి నవ్వుతారు.

* టీమ్ మేట్ : ఈ ప్రపంచం భయానక ప్రదేశం. ఇబ్బందికరమైన ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఫేస్ చేయడానికి, రెస్టారెంట్స్‌లో ఏం ఆర్డర్ చేయాలో తెలుసుకోవడానికి భాగస్వామి ఉంటారు.

* ఫ్రీ థెరపిస్ట్ : మీ ఎంబారసింగ్ సీక్రెట్స్ అన్నీ భాగస్వామికి తెలుసు కాబట్టి ఓపెన్‌గా ఉండొచ్చు. కుకింగ్ చేసేటప్పుడు మీతో మాట్లాడే పార్టనర్‌, క్రిటికల్ సిచ్యుయేషన్స్ నుంచి బయటకు తీసుకొచ్చే హీలర్‌ దొరుకుతారు.

* బ్లాంకెట్ థీఫ్: బెడ్‌పై వెచ్చని దుప్పట్ల కోసం యుద్ధం చేసే స్వీట్ ఎనిమీ, సరైన ప్రత్యర్థి దొరకొచ్చు. చివరకు షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటూ సర్దుకుపోతారు.

* డబుల్ క్లాత్స్ : ఓవర్‌సైజ్డ్ హుడీ, షర్ట్స్, టీ షర్ట్స్ మీ న్యూ ఫేవరేట్ కంఫర్ట్ అవుట్‌ఫిట్ అయిపోతుంది.

* నో లోన్లీనెస్ : రోజులో లాంగెస్ట్ కంఫర్టబుల్ సైలెన్స్ మెయింటైన్ చేశాక పార్టనర్‌తో కలిసి ఉండటం ఆనందాన్నిస్తుంది. ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నామనే ఫీలింగ్ మీకు రిలీఫ్ ఇస్తుంది.

* సపోర్టర్: మీ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి ఎప్పటికీ వెన్నంటే ఉండే సపోర్టర్ దొరకొచ్చు. క్రేజీ ఫ్రెండ్‌గా ఉండిపోవచ్చు.

DISADVANTAGES

* ఫేసింగ్ రియాలిటీ : మీ అబ్జల్యూట్ వరెస్ట్‌ను చూస్తారు. మార్నింగ్ లేవగానే మీ నోటి నుంచి వచ్చే దుర్వాసన, చిరాకు తెప్పించే మూడ్ స్వింగ్స్, అసహ్యాన్ని కలిపించే మీ తుమ్ములు చికాకు తెప్పించొచ్చు.

* కెరీర్స్ : ఒకరి డ్రీమ్‌ను ఫుల్ ఫిల్ చేసేందుకు మరొకరు కెరీర్‌ త్యాగం చేయాల్సి ఉంటుంది. పిల్లల కోసమైనా శాక్రిఫైజ్ చేసే పరిస్థితి తలెత్తుతుంది.

* సోషల్ లైఫ్ ఎఫెక్ట్: వైల్డ్ నైట్ అవుట్స్‌కు బదులు కపుల్ డిన్నర్స్‌కు వెళ్లాలి.‘me time' కన్నా 'we time' ఎక్కువ ఉంటుంది. సోలో హ్యాబీస్‌కు గుడ్ బై చెప్పాల్సిందే ఇక.

* కాంప్రమైజ్ : రాజీ పడటం మీ ఇద్దరి మిడిల్ నేమ్ అయిపోతుంది. రూమ్ టెంపరేచర్, వీకెండ్ ప్లాన్స్ అన్నింటిలోనూ అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది.

* కంపేరిజన్స్ : సోషల్ మీడియాలో చూపించే పర్ఫెక్ట్ రీల్ కపుల్‌తో మీ రియల్ లైఫ్ మ్యారేజ్‌ను కంపేర్ చేసుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed