క‌జ్జికాయ‌లను ఈ విధంగా చేసుకోండి.. చాలా టేస్టీగా ఉంటాయి!

by Prasanna |   ( Updated:2024-03-01 11:56:02.0  )
క‌జ్జికాయ‌లను ఈ విధంగా  చేసుకోండి..  చాలా టేస్టీగా ఉంటాయి!
X

దిశ, ఫీచర్స్: మ‌నలో చాలా మంది క‌జ్జికాయ‌లు ఇష్టంగా తింటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఎప్పుడు పడితే అప్పుడు చేయరు.. ఎందుకంటే క‌జ్జికాయ‌లు తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. మరి కొంత మందికి అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలీదు. మొదటిసారి చేసే వారు కూడా కజ్జికాయలను సులభంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని పండగులకు మాత్రమే కాకుండా మీకు తినాలనిపించినప్పుడు కూడా చేసుకుని తినవచ్చు.

కజ్జికాయ‌లకి కావాల్సిన ప‌దార్థాలు:

ఒక కప్పు మైదాపిండి, ఒక టేబుల్‌ స్పూన్‌ రవ్వ, ఉప్పు, రెండు టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, ఒక కప్పు పుట్నాలు, ఒకటి ఎండు కొబ్బరి , ఆరు యాలకులు, నూనె.

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో మైదాపిండి , రవ్వ, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత, తగినన్ని నీళ్లు పోసుకోవాలి. దీని చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. తర్వాత నూనె వేసి మూతపెట్టి నిల్వ చేసుకోవాలి. జాడీలో కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి మెత్తగా మిక్స్ చేసి డబ్బాలో వేయాలి. అదే గిన్నెలో పుట్నా పప్పు వేసి కలపాలి.

పెరుగును ఒక గిన్నెలో వేసి మిక్సర్‌తో కలపండి. తర్వాత అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఈ పూరీని కజ్జికాయ‌లు లాగా మార్చండి. వీటిని అంచుల‌ను వ‌త్తి ఫోర్క్ తో డిజైన్ వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి.అంతే కజ్జి కాయలు రెడీ.

Read More..

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో డెత్ రిస్క్.. 32 రకాల వ్యాధులు కూడా..

Advertisement

Next Story

Most Viewed